PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-congress-jagana8d08df0-1fc9-4273-a0e0-651c4f39a4df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-congress-jagana8d08df0-1fc9-4273-a0e0-651c4f39a4df-415x250-IndiaHerald.jpgతాజాగా విభజన హామీల కోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దామని జగన్ కు లేఖరాశారు. విభజన హామీల అమలుపై అసెంబ్లీలో చర్చలు జరపాలని తీర్మానాలు చేయాలని సలహాఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పార్టీలన్నీ కలిసి ఉమ్మడి పోరాటాలు చేయాలని చెప్పారు. పార్టీలు ప్రజలను మోసం చేస్తుంటే కాంగ్రెస్ చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. ys sharmila congress jagan{#}Y. S. Rajasekhara Reddy;Sharmila;Andhra Pradesh;Jagan;Reddy;Congress;Partyఅమరావతి : తనను ఎక్కువగా ఊహించుకుంటున్నారా ?అమరావతి : తనను ఎక్కువగా ఊహించుకుంటున్నారా ?ys sharmila congress jagan{#}Y. S. Rajasekhara Reddy;Sharmila;Andhra Pradesh;Jagan;Reddy;Congress;PartyThu, 08 Feb 2024 07:00:00 GMT


వైఎస్ షర్మిలలో మొదటినుండి ఒక సమస్యుంది. అదేమిటంటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటం. ఈ సమస్యతోనే తెలంగాణాలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఏమాత్రం అవకాశం లేకపోయినా తనను తాను వైఎస్సార్ బిడ్డగా పరిచయం చేసుకున్నారు. తాను తెలంగాణా బిడ్డనని, తెలంగాణా ఆడబడుచునని ఏమిటేమిటో చాలా మాటలు చెప్పారు. రాజన్న బిడ్డగా అధికారంలోకి వస్తానని, సంక్షేమపథకాలు, అభివృద్ధి చేసి చూపిస్తానని చాలా చాలా చెప్పారు.





షర్మిల మాటలు విన్నవాళ్ళంతా భలే నవ్వుకున్నారు. తీరాచూస్తే వైఎస్సార్ బిడ్డా లేదు..రాజన్న బిడ్డా లేదు.  ఎన్నికలకు ముందు జెండా ఎత్తేసి, పార్టీని చాపచుట్టేసి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. తెలంగాణాలో డ్రామాలు అయిపోగానే కాంగ్రెస్ ఏపీ చీఫ్ బాధ్యతలు తీసుకుని ఇక్కడ యాక్షన్ మొదలుపెట్టారు. రావటం రావటమే తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద పడ్డారు. ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. జగన్ను ఎవరైనా ఏమన్నా అంటే టాప్ ప్రయారిటి ఇవ్వటానికి ఎల్లోమీడియా రెడీగా ఉంటుంది. ఆ విషయం తెలుసుకునే షర్మిల నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.





తాజాగా విభజన హామీల కోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దామని జగన్ కు లేఖరాశారు. విభజన హామీల అమలుపై అసెంబ్లీలో చర్చలు జరపాలని తీర్మానాలు చేయాలని సలహాఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పార్టీలన్నీ కలిసి ఉమ్మడి పోరాటాలు చేయాలని చెప్పారు. పార్టీలు ప్రజలను మోసం చేస్తుంటే కాంగ్రెస్ చూస్తు ఊరుకోదని హెచ్చరించారు.





ఇక్కడే షర్మిల పెద్ద జోక్ చేశారు. అసలు రాష్ట్రాన్ని నాశనంచేసిందే కాంగ్రెస్ పార్టీ. అడ్డుగోలు విభజన చేసి ఏపీ నాశనానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇపుడు విభజన హామీలను సాధించకపోతే చూస్తు ఊరుకోదని బెదిరించటమే విచిత్రంగా ఉంది. చూస్తు ఊరుకోకపోతే షర్మిల చేయగలిగేది ఏముంటుంది ? అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేదు. పార్లమెంటులో పట్టించుకునే దిక్కు కూడా లేదు. రేపటి ఎన్నికల్లో ఇపుడున్న సీట్లు కూడా వస్తాయో రావో కూడా తెలీదు. ఉత్తినే ఉడుత ఊపులు తప్ప ఇంకేమీ ఉండదని అందరికీ తెలుసు. ఎన్నికలకు ముందు ఇలాంటి డ్రామాలు మామూలే  అని జనాలు కూడా షర్మిలను లైట్ తీసుకుంటున్నారంతే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>