MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa6dedee-418f-4473-859f-4d5f47e821c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa6dedee-418f-4473-859f-4d5f47e821c8-415x250-IndiaHerald.jpgసిద్దు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమాతో జొన్నలగడ్డ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న టిల్లు స్క్వేర్ మార్చ్ 29 న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా నేడు సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ తో వచ్చారు మేకర్స్. 'టిల్లు స్క్వేర్ - సిద్దు బర్త్ డే గ్లింప్స్' పేరుతో రిలీజ్ tollywood{#}Duvvada Jagannadham;Car;Heart;siddhu;Comedy;Audience;Director;Cinema'టిల్లు స్క్వేర్' బర్త్ డే గ్లింప్స్..'టిల్లు స్క్వేర్' బర్త్ డే గ్లింప్స్..tollywood{#}Duvvada Jagannadham;Car;Heart;siddhu;Comedy;Audience;Director;CinemaThu, 08 Feb 2024 13:05:00 GMTసిద్దు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమాతో జొన్నలగడ్డ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న టిల్లు స్క్వేర్ మార్చ్ 29 న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా  సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ తో వచ్చారు మేకర్స్. 'టిల్లు స్క్వేర్ - సిద్దు బర్త్ డే గ్లింప్స్' పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియోలో సిద్దు మరోసారి తన కామెడీ, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సుమారు నిమిషం 25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 

ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమతో పాటూ మరో నటుడు కారులో వెళ్తుండగా..' హే బ్రో.. మీ బర్త్ డే అంట కదా! హ్యాపీ బర్త్ డే' అంటూ హీరోకి కార్ లో అతను విష్ చేస్తాడు. దాంతో పక్కనే ఉన్న అనుపమ..' టిల్లు ఐ యాం సో సారీ హ్యాపీ బర్త్డే టూ యు' అంటూ సిద్దుని కిస్ చేస్తుంది. ఆ తర్వాత..' టిల్లు లాస్ట్ ఇయర్ నీ బర్త్ డే కి నువ్వెక్కడున్నావ్?' అని అనుపమ సిద్దుని అడగగానే dj టిల్లు లోని ఫ్లాష్ బ్యాక్ చూపించారు. దాన్ని సిద్దు చాలా వెరైటీగా అనుపమకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు." మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ మూవీ చూశాం"  అని అనడంలో ఏ మూవీ ? అని అనుపమ అడుగుతుంది.. అందుకు సిద్జు బదులిస్తూ.." ఇట్స్ నల్లమల్ల ఫారెస్ట్ నల్లచీర..

ఫిలిం బై రాధిక.. చాలా పెద్ద డైరెక్టర్ ఆమె బాగా చెప్తుంది కథలు" అంటూ సిద్ధు వివరించిన తీరు ఫుల్ ఫన్ జనరేట్ చేసింది. సిద్ధు చెప్పింది అర్థం కాక అనుపమ..' అట్లాంటి మూవీ కూడా రిలీజ్ అయిందా?' అని అడిగితే..' ఓటీటీటీ, పాన్ మల్కాజిగిరి మూవీ అది' అని అంటాడు. ఆ తర్వాత దాని స్టోరీ ఏంటని అడిగితే.." అది లవ్, హార్ట్ బ్రేక్, హారర్, హిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్.. ఓవరాల్ గా చాలా పెద్ద కామెడీ మూవీ అది.. నువ్వు ఇంకోసారి అడగకు మళ్ళా.. అంటే ఎప్పుడో చూసిన మూవీ కదా! సరిగ్గా గుర్తు రావడంలేదు.. గుర్తుతెచ్చుకుందామని కూడా లేదు మనకి.. ఏవో పాత జ్ఞాపకాలు" అంటూ సిద్ధు జస్ట్ గ్లింప్స్ మీడియాలోనే తన వెరైటీ డైలాగ్ మోడ్యులేషన్ తో అదరగొట్టేసాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>