MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff88163f-ce3d-4a23-a000-d98158ffc5b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff88163f-ce3d-4a23-a000-d98158ffc5b8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన 'గూఢచారి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'G2' సినిమా రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్స్, ప్రీ లుక్ టీజర్ ప్రేక్షకులను tollywood{#}Salman Khan;Thriller;manish;Manish Pandey;bollywood;Cinema;Hero;raj;Romantic;abhishek;Blockbuster hit;media;Success;Heroine;Newsఅడివి శేష్ 'G2' లో బాలీవుడ్ స్టార్ హీరోఅడివి శేష్ 'G2' లో బాలీవుడ్ స్టార్ హీరోtollywood{#}Salman Khan;Thriller;manish;Manish Pandey;bollywood;Cinema;Hero;raj;Romantic;abhishek;Blockbuster hit;media;Success;Heroine;NewsThu, 08 Feb 2024 12:15:00 GMTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన 'గూఢచారి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'G2' సినిమా రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్స్, ప్రీ లుక్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అడివి శేష్ 'G2' మూవీలో బాలీవుడ్ అగ్ర హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నట్లు తాజా సమాచారం. సినిమాలో ఇమ్రాన్ హష్మీ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బాలీవుడ్ లో 'టైగర్ 3' అనే స్పై యాక్షన్ మూవీలో తన విలనిజంతో ఆకట్టుకున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు అడివి శేష్ 'G2' లో మరోసారి ప్రతి నాయకుడిగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ తో అడవి శేష్ సినిమాకి బాలీవుడ్ లో మరింత క్రేజ్ దక్కే అవకాశం ఉంది.

టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ ఎవరూ ఊహించని విధంగా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సినిమాతో విలన్ గా మారాడు. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తలకెక్కిన ఈ సినిమాకి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గత ఏడాది రిలీజై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి.

 


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>