MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandhc2253a95-78de-4b61-820b-0c81155e3687-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandhc2253a95-78de-4b61-820b-0c81155e3687-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఈయన హీరో గా నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో ఆ తర్వాత ఈయనకు హీరోగా సినిమాల్లో అవకాశాలు రాలేదు. అలాంటి సమయం లోనే తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీ లో గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , అలాగే ఈ మూవీ లో గోపీచంద్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుసగా ఈయనకు తెలుగు సినీ పgopichandh{#}Jayam;Evening;teja;Posters;Josh;March;cinema theater;Telugu;Hero;Success;Cinema"బీమా" ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల తేదీ వచ్చేసింది..!"బీమా" ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల తేదీ వచ్చేసింది..!gopichandh{#}Jayam;Evening;teja;Posters;Josh;March;cinema theater;Telugu;Hero;Success;CinemaThu, 08 Feb 2024 23:16:47 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఈయన హీరో గా నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో ఆ తర్వాత ఈయనకు హీరోగా సినిమాల్లో అవకాశాలు రాలేదు. అలాంటి సమయం లోనే తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీ లో గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , అలాగే ఈ మూవీ లో గోపీచంద్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వరుసగా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి నాయకుడి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా కొంత కాలం పాటు కేవలం సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన ఈయన ఆ తర్వాత యజ్ఞం మూవీ తో మళ్లీ హీరో గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. 

యజ్ఞం మూవీ సూపర్ సక్సెస్ కావడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం సినిమాలో హీరో పాత్రలోనే నటిస్తూ అద్భుతమైన జోష్ లో గోపీచంద్ కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా గోపీచంద్ "బీమా" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు హర్ష దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని ఈ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని మొదటి పాట ప్రోమో విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "ఏదో ఏదో మాయ" అంటూ సాగే పాట యొక్క ప్రోమో ను రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>