Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith9e48ed5a-d3e2-49ee-9e95-0c115a85742d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith9e48ed5a-d3e2-49ee-9e95-0c115a85742d-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగిన వారు.. ఇక క్రికెట్ ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇక ఎన్నో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. మరి కొంత మంది స్థిరాస్తులను కొనుగోలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది తమకు లైఫ్ ఇచ్చిన క్రికెట్ ఆటను నలుగురికి పంచడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రికెట్ అకాడమీని ప్రారంభించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత జట్టుRohith{#}Yuvraj Singh;Yuva;Rohit Sharma;Cricket;England;Santosham;India;Schoolక్రికెట్ అకాడమీ పెట్టే ఆలోచనలో రోహిత్.. ఎక్కడో తెలుసా?క్రికెట్ అకాడమీ పెట్టే ఆలోచనలో రోహిత్.. ఎక్కడో తెలుసా?Rohith{#}Yuvraj Singh;Yuva;Rohit Sharma;Cricket;England;Santosham;India;SchoolTue, 06 Feb 2024 09:30:00 GMTసాధారణంగా భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగిన వారు.. ఇక క్రికెట్ ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇక ఎన్నో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. మరి కొంత మంది స్థిరాస్తులను కొనుగోలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది తమకు లైఫ్ ఇచ్చిన క్రికెట్ ఆటను నలుగురికి పంచడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రికెట్ అకాడమీని ప్రారంభించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇప్పటికే భారత జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించి రిటైర్మెంట్ తో మాజీ ప్లేయర్లుగా మారిపోయిన వారు ఇలా క్రికెట్ అకాడమీని స్థాపించారు. అయితే ఇక ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తోంది. ఏకంగా త్వరలోనే రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీ ప్రారంభించబోతున్నాడు అంటూ ప్రస్తుతం భారత క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్లో ఇలా తన అకాడమీ ఏర్పాటు చేయాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడట.


 సిలిగిరిలోని మయూర్ స్కూల్ వద్ద రోహిత్ శర్మ ఇలా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నాడట. అయితే ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి మాజీ ప్లేయర్లు ఇలా క్రికెట్ అకాడమీలు ప్రారంభించి.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రోహిత్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు అని తెలియడంతో ఎంతో మంది యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు భవిష్యత్తు ప్లేయర్లను అందించడానికి రోహిత్ అకాడమీ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడంలో రోహిత్ బిజీబిజీగా ఉన్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>