PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-pawan1ca99016-33f0-4757-9b1a-a1d40a480d1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-pawan1ca99016-33f0-4757-9b1a-a1d40a480d1d-415x250-IndiaHerald.jpgచంద్రబాబు 25 సీట్లను ఇవ్వటానికి అంగీకరించారు. పవన్ గట్టిగా పట్టుబడితే మరో మూడు సీట్లు మాత్రమే దక్కుతాయట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం టీడీపీ వదులుకున్న నియోజకవర్గాల్లో కొన్నిపేర్లు బయటకు వచ్చాయి. అవేమిటంటే యలమంచిలి, రాజోలు, రాజానగరం, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమం, తెనాలి, దర్శి, కాకినాడ రూరల్. ఇందులో యలమంచిలిలో పోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున పంచకర్ల రమేష్ పోటీచేశారు. ఈయన ముందు వైసీపీలో చేరి ఈమధ్యనే జనసేనలో చేరారు. ఈయన కోసమే తమ్ముడు త్యాగం చేయాల్సొచ్చింది. tdp chandrababu pawan{#}Meera;RAMAKRISHNA BABU VELAGAPUDI;Vijayawada;Janasena;Vishakapatnam;TDP;kakinada;Jaleel Khan;Kadiri;Tammudu;Rajahmundry;Thammudu;MLA;Pawan Kalyan;Newsఅమరావతి : సీనియర్ తమ్ముళ్ళకు షాక్అమరావతి : సీనియర్ తమ్ముళ్ళకు షాక్tdp chandrababu pawan{#}Meera;RAMAKRISHNA BABU VELAGAPUDI;Vijayawada;Janasena;Vishakapatnam;TDP;kakinada;Jaleel Khan;Kadiri;Tammudu;Rajahmundry;Thammudu;MLA;Pawan Kalyan;NewsTue, 06 Feb 2024 07:00:00 GMT

పార్టీల మధ్య సమస్య ఇలాగే ఉంటుంది. మామూలురోజుల్లో బలోపేతం అయినట్లు కనిపించినా ఎన్నికల సమయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సుంటుంది. పొత్తులంటేనే పార్టీలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. అయితే టీడీపీ-జనసేన పొత్తులో విచిత్రం ఏమిటంటే త్యాగాలన్నీ తమ్ముళ్ళు మాత్రమే చేయాల్సొస్తోంది. ఎందుకంటే జనసేన పోటీచేసే ప్రతి నియోజకవర్గంలోను టీడీపీ బలంగా ఉండటమే కారణం. జనసేనకు బలం పెద్దగా  లేదుకాబట్టి ప్రతి సీటును టీడీపీ త్యాగంచేయక తప్పటంలేదనే చెప్పాలి. పొత్తులో జనసేనకు 30 సీట్లు కావాలని పవన్ కల్యాణ్ అడిగారు.





చంద్రబాబు 25 సీట్లను ఇవ్వటానికి అంగీకరించారు. పవన్  గట్టిగా పట్టుబడితే మరో మూడు సీట్లు మాత్రమే దక్కుతాయట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం టీడీపీ వదులుకున్న నియోజకవర్గాల్లో కొన్నిపేర్లు బయటకు వచ్చాయి. అవేమిటంటే యలమంచిలి, రాజోలు, రాజానగరం, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమం, తెనాలి, దర్శి, కాకినాడ రూరల్. ఇందులో యలమంచిలిలో పోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున పంచకర్ల రమేష్ పోటీచేశారు. ఈయన ముందు వైసీపీలో చేరి ఈమధ్యనే జనసేనలో చేరారు. ఈయన కోసమే తమ్ముడు త్యాగం చేయాల్సొచ్చింది.





రాజోలు, రాజానగరంలో సీనియర్లు గొల్లపల్లి సుర్యారావు, బొడ్డు వెంకటరమణ చౌదరికి టికెట్లు ఎగిరిపోయాయి. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు, నరసాపురంలో బండారు మాధవనాయుడు త్యాగరాజుల జాబితాలో చేరిపోయారు. విజయవాడ పశ్చిమంలో పోయిన ఎన్నికల్లో షబానా ఖాతూమ్ పోటీచేశారు. రాబోయే ఎన్నికల్లో జలీల్ ఖాన్ తో పాటు సీనియర్ తమ్ముళ్ళు బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాజా పరిణామాల్లో వీళ్ళకు నిరసతప్పదని తేలిపోయింది.





తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, దర్శిలో కదిరి బాబూరావుకు షాక్ తప్పదు. కాకినాడ రూరల్ స్ధానంలో  పోటీచేసిన పిల్లి అనంతలక్ష్మికి రాబోయే ఎన్నికల్లో సీటేలేదు. ఇవి కాకుండా తిరుపతి, పిఠాపురం, వైజాగ్ తూర్పులో సుగుణమ్మ, ఎస్వీఎస్ఎన్ వర్మ, వెలగపూడి రామకృష్ణబాబు కూడా త్యాగాలు చేయాల్సిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  రాజమండ్రి ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైజాగ్ ఈస్ట్ ఎంఎల్ఏ రామకృష్ణబాబు కూడా త్యాగరాజులు అయిపోతున్నారు. జనసేన పోటీచేయబోయే లిస్టు అధికారికంగా ప్రకటిస్తే కాని టీడీపీలో ఎంతమంది సీనియర్లు టికెట్లు కోల్పోతున్నారో తెలీదు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>