PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-tdp9365e1c9-cf74-4d1e-a78f-96d38e560039-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-tdp9365e1c9-cf74-4d1e-a78f-96d38e560039-415x250-IndiaHerald.jpgపొత్తుల్లో సీట్ల సర్దుబాట్లలో కొంచెం ఇబ్బందులుంటాయన్నారు. సీట్ల సర్దుబాటు కారణంగా కొందరు నేతలు నిరాసకు గురికావాల్సుంటుందన్నారు. గతంలో సీపీఐ, సీపీఎంతో కూడా పొత్తులపుడు ఇబ్బందులు ఎదురైన విషయాన్ని గుర్తుచేశారు. అంటే సీపీఐ, సీపీఎం పార్టీలు టీడీపీ స్ధాయి ఒకటే అని పవన్ తేల్చేశారా అన్న డౌటు పెరిగిపోతోంది. టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని సీట్లలో ఇబ్బందులున్నాయని చెప్పారు. జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాల్లో 98 శాతం గెలుపు అవకాశాలున్నట్లు పవన్ చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది. janasena pawan tdp{#}CBN;Janasena;TDP;YCP;Pawan Kalyan;MP;News;Partyఅమరావతి : సొంతనేతలకే పవన్ షాకిచ్చారా ?అమరావతి : సొంతనేతలకే పవన్ షాకిచ్చారా ?janasena pawan tdp{#}CBN;Janasena;TDP;YCP;Pawan Kalyan;MP;News;PartyTue, 06 Feb 2024 05:00:00 GMT

మామూలుగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడేది అర్ధంకాదు. ఎందుకంటే ఒక సబ్జెక్టు మాట్లాడుతు సంబంధంలేని మరో అంశంలోకి వెళిపోతారు. పవన్ ఏమి మాట్లాడుతున్నారో  అర్ధంచేసుకోవటానికి వినేవాళ్ళు జుట్టు పీక్కోవాల్సిందే. ఇపుడిదంతా ఎందుకంటే చంద్రబాబునాయుడుతో సీట్ల సర్దుబాటుపై సీరియస్ గా చర్చలు మొదలుపెట్టారు. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జాయినింగ్ సందర్భంగా చర్చలకు విరామం ఇచ్చి పార్టీ ఆఫీసుకు వచ్చారు. ఎంపీ జాయినింగ్ సందర్భంగా నేతలతో మాట్లాడారు. అప్పుడు పవన్ మాటలు విన్నవారు అయోమయంలోకి పడిపోయుంటారనటంలో సందేహంలేదు.





పొత్తుల్లో సీట్ల సర్దుబాట్లలో కొంచెం ఇబ్బందులుంటాయన్నారు. సీట్ల సర్దుబాటు కారణంగా కొందరు నేతలు నిరాసకు గురికావాల్సుంటుందన్నారు. గతంలో సీపీఐ, సీపీఎంతో కూడా పొత్తులపుడు ఇబ్బందులు ఎదురైన విషయాన్ని గుర్తుచేశారు. అంటే సీపీఐ, సీపీఎం పార్టీలు టీడీపీ స్ధాయి ఒకటే అని పవన్ తేల్చేశారా అన్న డౌటు పెరిగిపోతోంది. టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని సీట్లలో ఇబ్బందులున్నాయని చెప్పారు. జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాల్లో 98 శాతం గెలుపు అవకాశాలున్నట్లు పవన్ చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది.





ఎన్నిసీట్లలో పోటీచేశామన్నది ముఖ్యంకాదని, గెలిచే సీట్లలో పోటీచేయాలన్నదే టార్గెట్ అన్నారు. అంటే పవన్ మాటల్లో అర్ధమైంది ఏమిటంటే ఇప్పటివరకు జనసేన నేతలు డిమాండ్లు చేస్తున్నట్లు టీడీపీ 50-60 సీట్లు ఇవ్వటంలేదని చెప్పకనే చెప్పేశారు. అలాగే చంద్రబాబు ఎన్నిసీట్లిస్తే అన్ని సీట్లు తీసుకోవాల్సిందే అన్న సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఎన్నిసీట్లలో పోటీచేస్తున్నామన్నది ముఖ్యంకాదంటే అర్ధమేంటి ? పైగా గెలిచే సీట్లలోనే జనసేన పోటీచేస్తోందని చెప్పటమే విచిత్రంగా ఉంది. అందుబాటులోని సమాచారం ప్రకారం జనసేనకు 28 సీట్లు దక్కితే చాలా ఎక్కువ.





పైగా ఇంకో విచిత్రం ఏమిటంటే జనసేన పోటీచేసే నియోజకవర్గాల్లో 98 శాతం గెలుపు అవకాశాలున్నాయని జోస్యం కూడా చెప్పేశారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత మళ్ళీ రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండోవిడత చర్చలకు చంద్రబాబుతో భేటీ అయ్యారు. మొత్తానికి పార్టీ ఆఫీసులో పవన్ మాటలు విన్నవారు అయోమయంలోకి వెళ్ళిపోయుంటారనటంలో సందేహంలేదు. అసలు తమ అధినేత ఏమి చెప్పదలచుకున్నారు ? ఏమిచెప్పారో కూడా నేతలకు ఓపట్టాన అర్ధమయ్యుండదు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>