Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiabc1d842b-ed15-4a85-9ddb-ac8797c12649-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiabc1d842b-ed15-4a85-9ddb-ac8797c12649-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు ఉన్న క్రేజ్ రోజురోజుకు ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా పొట్టి ఫార్మాట్ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక పొట్టి ఫార్మాట్లో ఎక్కడ మ్యాచ్ జరిగిన కూడా అందరు ప్రేక్షకులు విపరీతంగా స్టేడియం కు తరలివస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే సాధారణ ద్వైపాక్షిక సిరీస్ లు టి20 ఫార్మాట్లో జరిగితేనే ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే ఇక ఈ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ కప్ జరిగితే ఒకరకంగా వరల్డ్ క్రికెట్లో పండగ వాతాIndia{#}West Indies;Gujarat - Gandhinagar;World Cup;Cricket;Audience;India;June;Yevaruఈసారి టి20 వరల్డ్ కప్ విజేత ఆ జట్టే.. టీమిండియా మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?ఈసారి టి20 వరల్డ్ కప్ విజేత ఆ జట్టే.. టీమిండియా మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?India{#}West Indies;Gujarat - Gandhinagar;World Cup;Cricket;Audience;India;June;YevaruTue, 06 Feb 2024 12:30:00 GMTవరల్డ్ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు ఉన్న క్రేజ్ రోజురోజుకు ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా పొట్టి ఫార్మాట్ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక పొట్టి ఫార్మాట్లో ఎక్కడ మ్యాచ్ జరిగిన కూడా అందరు ప్రేక్షకులు విపరీతంగా స్టేడియం కు తరలివస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే సాధారణ ద్వైపాక్షిక సిరీస్ లు టి20 ఫార్మాట్లో జరిగితేనే ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే ఇక ఈ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ కప్ జరిగితే ఒకరకంగా వరల్డ్ క్రికెట్లో పండగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి.


 అయితే ఈ ఏడాది ఇలాంటి ఒక క్రికెట్ పండుగను ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. జూన్ 1వ తేదీ నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ యూఎస్ వేదికలలో ఈ వరల్డ్ కప్ టోర్నీ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిక ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ వరల్డ్ కప్ టోర్నిలో విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.



 అయితే టి20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధిస్తుంది అనే నమ్మకం తనకు ఉంది అంటూ మాజీ కోచ్ గ్యారి కిర్ స్టేన్ వ్యాఖ్యానించాడు. అయితే నాకౌట్ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. పొట్టి ఫార్మాట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. భారత జాతీయ జట్టుకు కోచింగ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ కిర్ స్టేన్ చెప్పుకొచ్చాడు. ఈసారి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్ కి మెంటర్గా వ్యవహరించబోతున్నట్లు తెలిపాడు. అయితే వన్డే క్రికెట్ ను బతికించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>