TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipita-aadhar-card-vishayamlo-eapatiki-chyakudani-thapule-eaveac4905b8-5e5c-44c3-a085-934bdf0e478c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipita-aadhar-card-vishayamlo-eapatiki-chyakudani-thapule-eaveac4905b8-5e5c-44c3-a085-934bdf0e478c-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో కచ్చితంగా ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఒక డాక్యుమెంటరీగా మారిపోయింది.. దీన్నే చాలా అదునుగా తీసుకొని నేరగాళ్లు మోసగాళ్లు సైతం చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ద్వారా వ్యక్తిగత విషయాలను సేకరించి చాలామంది బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఇలాంటి విషయాల పైన అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల గుర్తింపును వెరిఫై చేసేందుకే ఈ ఆధార్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో ఎలక్ట్రానికల్, ఆఫ్లైన్లో ఆధార్ AADHAR CARD;MISTECTES{#}Biometric;Ishtam;Cheque;Aadhar;Yevaru;Government;Indiaబుల్లి పిట్ట: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికీ చేయకూడని తప్పులు ఇవే..!!బుల్లి పిట్ట: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికీ చేయకూడని తప్పులు ఇవే..!!AADHAR CARD;MISTECTES{#}Biometric;Ishtam;Cheque;Aadhar;Yevaru;Government;IndiaTue, 06 Feb 2024 13:00:00 GMTఈ రోజుల్లో కచ్చితంగా ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఒక డాక్యుమెంటరీగా మారిపోయింది.. దీన్నే చాలా అదునుగా తీసుకొని నేరగాళ్లు మోసగాళ్లు సైతం చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ద్వారా వ్యక్తిగత విషయాలను సేకరించి చాలామంది బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఇలాంటి విషయాల పైన అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల గుర్తింపును వెరిఫై చేసేందుకే ఈ ఆధార్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో ఎలక్ట్రానికల్, ఆఫ్లైన్లో ఆధార్ నెంబర్ చూసి వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు.


ప్రజలు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తున్నప్పుడు చేయకూడని పనులు ఒకసారి చూద్దాం.. ఆధార్ నెంబర్ అనేది కచ్చితంగా 12 అంకెలు కలిగి ఉంటుంది. దీనిని ప్రభుత్వం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అందిస్తుంది. మీరు ఎవరికైనా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేటప్పుడు చట్టపరమైన అవసరాలకు అనుగుణంగానే నిర్వహించే సంస్థలకు మాత్రమే ఇవ్వాలని ఆధార్ చట్టం నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయి. ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు అది ఏ ప్రయోజనం కోసం ఇస్తున్నారు ఆ సంస్థ కూడా తెలియజేయాలి.


ఒకవేళ మీరు ఆధార్ కార్డు నెంబర్ షేర్ చేయడం ఇష్టం లేకపోతే..m-aadhaar ను ఎంచుకోవడం మంచిది.మీ ఆధార్ కార్డ్ అతెంటికేషన్  హిస్టరీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా చెక్ చేసుకోవడం మంచిది. మీ ఈమెయిల్ ఐడి ని ఆధార్ కార్డుకి లింక్ చేయడం మంచిది. అలాగే ఓటీపీ వచ్చేందుకు మీ ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ ని లింక్ చేయాలి. మీరు ఆధార్ కార్డు ఉపయోగించని సమయంలో ఆధార్  బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్ ని ఉపయోగించడం మంచిది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎవరు ఎలాంటి ఫ్రాడ్ చేయలేరు.. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా దుర్వినియోగంగా అనిపించినట్టు సంకేతాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1947 కి కాల్ చేయడం లేదా help@uidai.gov.in ఈమెయిల్ చేయాలి. మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఎప్పుడు కూడా ఎక్కడపడితే అక్కడ ఇవ్వకూడదు. ఇలాంటి విషయాలు ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>