EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddyb72ab41b-e361-4432-9bd7-c37ebe541634-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddyb72ab41b-e361-4432-9bd7-c37ebe541634-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టి పోలింగ్ లో తెలంగాణ ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవకాశం ఎవరికీ దక్కుతుంది అనే చర్చ ఇప్పటికే మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ కు సీఎంగా అవకాశం దక్కుతుందా.. లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సీఎం అవ్వాలనేది ప్రతి రాజకీయ నాయకుడి కోరిక. ఆ అవకాశం మాత్రం కొద్ది మందికే వరిస్తుంది. రేవంత్ తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నిREVANTH REDDY{#}revanth;Revanth Reddy;palamuru;TPCC;Athadu;Yevaru;Manam;Elections;Congress;Kumaar;Party;CM;Telangana;jobసీఎం పదవిపై 2007లోనే కన్నేసిన రేవంత్‌ రెడ్డి?సీఎం పదవిపై 2007లోనే కన్నేసిన రేవంత్‌ రెడ్డి?REVANTH REDDY{#}revanth;Revanth Reddy;palamuru;TPCC;Athadu;Yevaru;Manam;Elections;Congress;Kumaar;Party;CM;Telangana;jobThu, 30 Nov 2023 08:00:00 GMTతెలంగాణ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టి పోలింగ్ లో తెలంగాణ ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవకాశం ఎవరికీ దక్కుతుంది అనే చర్చ ఇప్పటికే మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ కు సీఎంగా అవకాశం దక్కుతుందా.. లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.


సీఎం అవ్వాలనేది ప్రతి రాజకీయ నాయకుడి కోరిక. ఆ అవకాశం మాత్రం కొద్ది మందికే వరిస్తుంది. రేవంత్ తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంలోనే  సీఎం కావాలని నిర్ణయించుకున్నట్లు ఓ సీనియర్ విశ్లేషకుడితో పంచుకున్నారు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే మనం బడికి వెళ్లే విద్యార్థిని నువ్వు ఏం అవుతావు అని అడిగితే ఫలానా ఉద్యోగం చేయాలని ఉందని అతడు మనకు చెప్తాడు.


దానికోసం శ్రమించి ఆ లక్ష్యాన్ని సాధిస్తాడు. అలాగే తనకు ప్రజాప్రతినిధి అయిన తొలినాళ్లలో సీఎం కావాలనే కోరిక ఉండేదని రేవంత్ రెడ్డి తన మనసులో మాటను ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీఎంగా ఎవరు ఉంటారు అనే ప్రశ్నకు బదులిస్తూ..


ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు చాలా కసరత్తులు జరిగాయి. చాలా మంది సీనియర్ నేతలు ఉన్నా అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పజెప్పింది. రాష్ట్రంలో జాతీయ పార్టీకి అధ్యక్షుడిని చేసింది.  నేను ఆ బాధ్యతలు దృష్టిలో పెట్టుకొనే పాలమూరు బిడ్డలకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం దక్కిందని చెప్పాను. బాధ్యాతయుతమైన పదవిలో ఉన్నాను కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది అని వివరించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>