PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-kcr-revanth-kishand3881e43-bceb-4601-a5a3-fbb84badf3a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-kcr-revanth-kishand3881e43-bceb-4601-a5a3-fbb84badf3a1-415x250-IndiaHerald.jpgఎందుకంటే అడ్డమైన ప్రలోభాలకు తెరలేచేది, ఫైనల్ అయ్యేది అంతా ఈ ఒకటిన్నర రోజులోనే కాబట్టి. ప్రచార సమయంలో కూడా అభ్యర్ధులు, నేతలు ఓటర్లకు అనేక రకాల ప్రలోభాలకు గురిచేసింది వాస్తవం. అలాగే అధికారంలోకి వస్తే చేయబోయే పనులపైన కూడా చాలా హామీలే ఇచ్చాయి. అయితే అవన్నీ బహిరంగంగా జరిగిన వ్యవహారాలు. ఇపుడు ఈ ఒకటిన్నర రోజులో జరగబోయే ప్రలోబాలు డబ్బు, వస్తు రూపంలో ఉంటాయని అందరికీ తెలిసిందే.telangana kcr revanth kishan{#}Yevaru;Partyహైదరాబాద్ : అసలు కథ ఇప్పుడే మొదలైందా ?హైదరాబాద్ : అసలు కథ ఇప్పుడే మొదలైందా ?telangana kcr revanth kishan{#}Yevaru;PartyWed, 29 Nov 2023 05:00:00 GMT


దాదాపు నెలన్నరగా ప్రచారంతో హోరెత్తిపోయిన తెలంగాణాలో అసలు అంకానికి ఇపుడే తెరలేచింది. 28వ తేది సాయంత్రానికి ప్రచారానికి ఫులిస్టాప్ పడింది. 30వ ఉదయం పోలింగ్ మొదలవ్వబోతోంది. కాబట్టి మధ్యలో ఉన్న ఒకటిన్నర రోజు అన్నీ పార్టీలకు చాలా కీలకమన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలు ప్రచారం పేరుతో ఇన్నిరోజులు పడిన కష్టమంతా ఒక ఎత్తు ఈ ఒకటిన్నర రోజు పడే కష్టం ఒక ఎత్తని చెప్పాలి. ఈ ఒకటిన్నర రోపుపడే కష్టమే అభ్యర్ధుల గెలుపోటముల్లో ఎక్కువ పాత్ర పోషిస్తుంది.





ఎందుకంటే అడ్డమైన ప్రలోభాలకు తెరలేచేది, ఫైనల్ అయ్యేది అంతా ఈ ఒకటిన్నర రోజులోనే కాబట్టి. ప్రచార సమయంలో కూడా అభ్యర్ధులు, నేతలు ఓటర్లకు అనేక రకాల ప్రలోభాలకు గురిచేసింది వాస్తవం. అలాగే అధికారంలోకి వస్తే చేయబోయే పనులపైన కూడా చాలా హామీలే ఇచ్చాయి. అయితే అవన్నీ బహిరంగంగా జరిగిన వ్యవహారాలు. ఇపుడు ఈ ఒకటిన్నర రోజులో జరగబోయే ప్రలోబాలు డబ్బు, వస్తు రూపంలో ఉంటాయని అందరికీ తెలిసిందే.





ఈ ఒకటిన్నర రోజు అధికారపార్టీ అని లేదా ప్రతిపక్షాలని లేదు. గెలుపుకు కష్టపడే ప్రతి పార్టీ అభ్యర్ధి ఈ ఒకటిన్నర రోజు ఓటర్లను కలవటానికి నానా అవస్తలు పడాల్సిందే తప్ప వేరే దారిలేదు. స్పష్టమైన ఆధిక్యతతో గెలుస్తున్నామని అనుకున్న అభ్యర్ధులేమో ఒకరకంగా వ్యవహరిస్తారు. అలాకాకుండా గెలుపుటోములు 50:50 ఛాన్స్ అని అనుకునే అభ్యర్ధులకైతే టెన్షన్ ఓ లెవల్లో పీక్సులో ఉంటుందని చెప్పాల్సిందే.





గెలుపుపై ఎంతటి ధీమాతో ఉన్న అభ్యర్ధులైనా ఓటర్లను కలవాల్సిందే ఎంతోకొంత ముట్టచెప్పాల్సిందే తప్ప వేరేదారిలేదు. గెలుపుపై ధీమాతో ప్రచారం బాగా చేసుకున్నాం కాబట్టి ఇక ఎవరినీ కలవాల్సిన అవసరంలేదు, ఎవరికీ ఏమీ చేయాల్సిన అవసరంలేదని అనుకుంటే మాత్రం దెబ్బపడిపోటం ఖాయం. ఇలా అనుకుని ఎవరినీ కలవకుండా ఏమీ చేయకుండా ఓడిపోయిన అభ్యర్ధులు చాలామందున్నారు గతంలో. అందుకనే ఈ ఒకటిన్నర రోజు అంకానికి కూడా అభ్యర్ధులు చాలా ప్రాధాన్యతిస్తారు. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>