MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈసారి డిసెంబర్ నెల సినిమాల వార్ మామూలుగా లేదు. అనేక భారీ సినిమాలు ఈనెలలో విడుదల కాబోతున్న పరిస్థితులలో ఇన్ని భారీ సినిమాలలో ఏసీనిమా హిట్ అవుతుంది అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. కేవలం ఒక వారం గ్యాప్ తో అటు సందీప్ వంగా రణబీర్ ల ‘యానిమల్’ నాని ‘హాయ్ నాన్న’ కేవలం ఒకేఒక్క వారం గ్యాప్ తో రాబోతున్నాయి. వాస్తవానికి ఈ రెండు సినిమాల ప్రమోషన్ బాగానే ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం ఈరెండు సినిమాల బయ్యర్లను వెంటాడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన భారీ నిర్మాతలు naani{#}Nani;Interview;war;News;Industry;Father;sandeep;December;Audience;Cinema;mediaసందీప్ వంగాతో చేతులు కలిపిన నాని !సందీప్ వంగాతో చేతులు కలిపిన నాని !naani{#}Nani;Interview;war;News;Industry;Father;sandeep;December;Audience;Cinema;mediaWed, 29 Nov 2023 13:41:12 GMTఈసారి డిసెంబర్ నెల సినిమాల వార్ మామూలుగా లేదు. అనేక భారీ సినిమాలు ఈనెలలో విడుదల కాబోతున్న పరిస్థితులలో ఇన్ని భారీ సినిమాలలో ఏసీనిమా హిట్ అవుతుంది అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. కేవలం ఒక వారం గ్యాప్ తో అటు సందీప్ వంగా రణబీర్ ల ‘యానిమల్’ నాని ‘హాయ్ నాన్న’ కేవలం ఒకేఒక్క వారం గ్యాప్ తో రాబోతున్నాయి.



వాస్తవానికి ఈ రెండు సినిమాల ప్రమోషన్ బాగానే ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం ఈరెండు సినిమాల బయ్యర్లను వెంటాడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన భారీ నిర్మాతలు తమ సినిమాల బయ్యర్లకు ధైర్యం చెపుతున్నట్లు టాక్. వాస్తవానికి నాని ‘హాయ్ నాన్న’ సందీప్ వంగా ‘యానిమల్’ ఒకే ఫాదర్ సెంటిమెంట్ తో కూడుకున్న సినిమాలు.



ఈ రెండు సినిమాలు కేవలం ఒకే వారం గ్యాప్ మధ్య విడుదల అవుతున్న పరిస్థితులలో ప్రేక్షకులు ఒకేసారి ఈరెండు సినిమాలను ఒకేలా ఆదరిస్తారా అన్నసందేహాలు ఈరెండు సినిమాల బయ్యర్లకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఎలర్ట్ అయిన నాని సందీప్ వంగా లు ఒకరినొకరు తమ సినిమాల గురించి ఇంటర్వ్యూ చేసుకుంటూ తమ రెండు సినిమాలు నాన్న సెంటిమెంట్ తో కూడుకున్నవి అయినప్పటికీ తమ సినిమా కథలు వేరు అన్నవిషయాన్ని ప్రేక్షకులకు తెలియ చేయడానికి వీరిద్దరూ కలిసి మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



త్వరలో వీరిద్దరూ ఒకరితో ఒకరు చేసుకున్న ఇంటర్వ్యూ ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతుందని తెలుస్తోంది. ఫిలిమ్ ఇండస్ట్రీ అనుభవాల రీత్యా గతంలో ఒకే సెంటిమెంట్ తో కూడుకున్న సినిమాలు తక్కువ వ్యవధిలో విడుదల అయినప్పుడు ఆ రెండు సినిమాలలో ఒక సినిమా మాత్రమే సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అయితే నానికి అదేవిధంగా సందీప్ వంగా కు కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..    









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>