EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan50abb988-5c20-43c0-b8bb-c43595d9e805-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan50abb988-5c20-43c0-b8bb-c43595d9e805-415x250-IndiaHerald.jpgతెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పార్టీలైన టీడీపీ, వైఎస్సార్ టీపీలు 2014 ఎన్నికల్లో సత్తా చాటాయి. టీడీపీ ఏకంగా 15 ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తే, వైసీసీ మూడు ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని తన మార్కును చూపించాయి. కానీ దాన్నే ప్రచారాస్త్రంగా వాడుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 2018 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీని చూపించి ఓట్లు కొల్లగొట్టి ఆ పార్టీలను చావు దెబ్బ కొట్టారు. 2018 ఎన్నికలతో వైసీపీ సైలెంట్ అయిపోగా అప్పుడు రెండు ఎమ్మెల్యే స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. ఒకప్పుడుPAWAN{#}Y. S. Rajasekhara Reddy;MP;MLA;YCP;Pawan Kalyan;Janasena;TDP;KCR;Party;Telanganaతెలంగాణ: బాబు, జగన్‌ వల్ల కానిది పవన్‌తో అవుతుందా?తెలంగాణ: బాబు, జగన్‌ వల్ల కానిది పవన్‌తో అవుతుందా?PAWAN{#}Y. S. Rajasekhara Reddy;MP;MLA;YCP;Pawan Kalyan;Janasena;TDP;KCR;Party;TelanganaTue, 28 Nov 2023 08:00:00 GMTతెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పార్టీలైన టీడీపీ, వైఎస్సార్ టీపీలు 2014 ఎన్నికల్లో సత్తా చాటాయి. టీడీపీ ఏకంగా 15 ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తే, వైసీసీ మూడు ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని తన మార్కును చూపించాయి. కానీ దాన్నే ప్రచారాస్త్రంగా వాడుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 2018 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీని చూపించి ఓట్లు కొల్లగొట్టి ఆ పార్టీలను చావు దెబ్బ కొట్టారు.


2018 ఎన్నికలతో వైసీపీ సైలెంట్ అయిపోగా అప్పుడు రెండు ఎమ్మెల్యే స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన టీడీపీ చివరకు 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకపోవడంతో ఆంధ్ర నుంచి వస్తున్న పార్టీలు అని ప్రచారం చేయడానికి కేసీఆర్ కు ఏమీ లేకుండా పోయింది. ఈ అంశం కూడా సెంటిమెంట్ ను రగిల్చే విధంగా ఉండేది. కానీ టీడీపీ పూర్తిగా పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఆ అంశంపై కేసీఆర్ మాట్లాడలేకపోతున్నారు.


సరికదా మాకు సెటిలర్ల ఓట్లు ముఖ్యమనే విధంగా వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని అంటున్నారు. వైసీపీ అయితే ఎప్పుడో తెలంగాణ నుంచి జెండా ఎత్తేసింది. కానీ టీడీపీ ఈ సారి పోటీ లో నిలవకపోవడం మాత్రం చాలా మంది నిరాశ చెందుతున్నారు. అయితే ఇక్కడ జనసేన మాత్రం పోటీలో ఉంది.


బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ నిల్చొవడం ఇక్కడ సానుకూలంశం. కేవలం ఆంధ్ర పార్టీ అని భావించే జనసేన ఇక్కడ పోటీ చేయడం, ప్రధానంగా కూకట్ పల్లి లాంటి సెటిలర్లు ఎక్కువగా ఉండే చోట బరిలో నిలవడం ప్రధాన అంశంగా కనిపిస్తుంది. మరి కూకట్ పల్లిలో, ఖమ్మంలో జనసేన ఎన్ని స్థానాలు గెలుస్తుంది. ఎంతమందికి లాభం చేకూరే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ చరిశ్మా పని చేస్తుందా.. ఖమ్మంలో ఉండే సెటిలర్లు ఆదరిస్తారాా.. లేదా అనేది చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>