EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/elections6ee3218d-da0b-4cb2-8942-be857b4a5ac6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/elections6ee3218d-da0b-4cb2-8942-be857b4a5ac6-415x250-IndiaHerald.jpgతెలంగాణ పాటిస్తుంది. దేశం అనుసరిస్తోంది. సాధించింది చాలా ఉంది. సాధిచాల్సింది ఇంకా ఉంది. అంటూ కేసీఆర్ నిర్వహించే ప్రతి సభలోను వ్యాఖ్యానిస్తున్నారు. మరి కేసీఆర్ చెబుతున్నట్లు తెలంగాణ వెలిగిపోతుందా. ఆదాయం పెరిగిందా. అంత స్థాయిలో వృద్ధి ఉంటే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు పడటం లేదు అనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. అయితే ఆంధ్రా, తెలంగాణలో మీడియా తన బాధ్యతను మరిచింది అని చెప్పవచ్చు. ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేకపోతున్నారు. ఆదాయం తగ్గిపోయింది. అవినీతి elections{#}YCP;media;Andhra Pradesh;KCR;Telanganaపార్టీల హామీలకు తెలంగాణ ఆదాయం సరిపోతుందా?పార్టీల హామీలకు తెలంగాణ ఆదాయం సరిపోతుందా?elections{#}YCP;media;Andhra Pradesh;KCR;TelanganaTue, 28 Nov 2023 06:00:00 GMTతెలంగాణ పాటిస్తుంది. దేశం అనుసరిస్తోంది. సాధించింది చాలా ఉంది. సాధిచాల్సింది ఇంకా ఉంది. అంటూ కేసీఆర్ నిర్వహించే ప్రతి సభలోను వ్యాఖ్యానిస్తున్నారు. మరి కేసీఆర్ చెబుతున్నట్లు తెలంగాణ వెలిగిపోతుందా. ఆదాయం పెరిగిందా.  అంత స్థాయిలో వృద్ధి ఉంటే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు పడటం లేదు అనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి.


అయితే ఆంధ్రా, తెలంగాణలో మీడియా తన బాధ్యతను మరిచింది అని చెప్పవచ్చు. ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేకపోతున్నారు. ఆదాయం తగ్గిపోయింది. అవినీతి పెరిగింది. వాస్తవంగా ఈ రెండు పరస్పర భిన్నమైన అంశాలు. ఆదాయం తగ్గితే అది రాష్ట్రానికి సంబంధించిన అంశం. నిజంగా తగ్గితే మీడియాలో కథనాలు ప్రచురించవచ్చు. నిర్భయంగా బయటకు చెప్పవచ్చు. అంటే జీఎస్టీ వసూళ్లు తగ్గాయా. పెరిగాయా.. స్థూల జాతీయోత్పత్తి ఎలా ఉంది వంటి అంశాలు ప్రస్తావించవచ్చు.


ఏపీలో ఎల్లో మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమే చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. కేసీఆర్ ను విమర్శించవచ్చు. అవినీతి ఆరోపణలు చేయవచ్చు. అది రాజకీయం. కానీ తెలంగాణ గురించి తప్పుడు మాటలు చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత 2014లో కేసీఆర్ సీఎం పదవి చేపట్టే నాటికి వివిధ పన్నుల రూపంలో రూ.29,288 కోట్లు మిగులు ఆదాయ ఉంది.


ప్రస్తుతం చూసుకుంటే రూ.1,06,949 కోట్లుగా ఉంది. 2014-15 పోల్చితే ప్రస్తుతం ఇంత ఆదాయం పెరిగింది. అయితే ఆదాయ వనరులు ఎలా సమకూర్చారు అనే విషయం ఎవరికీ తెలియదు. ధరలు పెంచారా.. పన్ను ధరలను పెంచారా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆదాయం పెరిగింది కాబట్టే రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. కాకపోతే ఈ ఆదాయం సరిపోవడం లేదు. అందుకనే సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.  మేం అధికారంలోకి వస్తే ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని ప్రకటించింది. కాకపోతే ఆదాయం ఎలా పెరిగింది. ఎలా పెంచుతారు అనే అంశంపై చర్చ జరగాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>