MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood572456ce-4a7d-4ebd-882b-65c34c7834fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood572456ce-4a7d-4ebd-882b-65c34c7834fb-415x250-IndiaHerald.jpg'గీత గోవిందం' తోనే రష్మిక కి స్టార్ స్టేటస్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకొని పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దానికి తోడు విజయ్ దేవరకొండ సినిమా అంటే రష్మిక నో చెప్పే ఛాన్స్ లేదు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని ఎంతో కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళ రిలేషన్ గురించి ఇద్దరు ఇప్పటిదాకా బయటపడలేదు. ఇదిలఉండగా సంక్రాంతి రేసు నుంచి tollywood{#}Geetha Govindam;Gita Govindam;Pongal;vijay deverakonda;dil raju;Makar Sakranti;India;Director;News;rashmika mandanna;Tollywood;Cinemaఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన.. ఫ్యాన్స్ కి పండగే..!ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన.. ఫ్యాన్స్ కి పండగే..!tollywood{#}Geetha Govindam;Gita Govindam;Pongal;vijay deverakonda;dil raju;Makar Sakranti;India;Director;News;rashmika mandanna;Tollywood;CinemaMon, 27 Nov 2023 18:56:11 GMT 'గీత గోవిందం' తోనే రష్మిక కి స్టార్ స్టేటస్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకొని పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దానికి తోడు విజయ్ దేవరకొండ సినిమా అంటే రష్మిక నో చెప్పే ఛాన్స్ లేదు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని ఎంతో కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళ రిలేషన్ గురించి ఇద్దరు ఇప్పటిదాకా బయటపడలేదు.  ఇదిలఉండగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'ఫ్యామిలీ స్టార్' కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 

అలా అని షూటింగ్ అయితే ఆపలేదు. రీసెంట్ గా వీసా ఇష్యూస్ తో ఫారిన్ షెడ్యూల్ క్యాన్సిల్ అయిందనే విషయం వాస్తవమే కానీ ప్రజెంట్ ముంబైలో సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కథ ప్రకారం ఫారెన్ లోకేషన్ డిమాండ్ లేకపోవడంతో పరుశురాం ఇక్కడే షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఎప్పుడూ సంక్రాంతి బరిలో కచ్చితంగా తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకునే దిల్ రాజు ఈసారి పంతం విడిచి పొంగల్ రేస్ నుంచి డ్రాప్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. వచ్చేవరకు ఫ్యామిలీ స్టార్ కూడా పొంగల్ బరిలో ఉన్నట్టే. 

సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉన్నందున ఇందులో కొన్ని ప్రత్యేక ఆకర్షణలు జోడిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఫ్యామిలీ స్టార్ మూవీలో నేషనల్ రష్మిక మందన్న క్యామియో రోల్ చేస్తుందట. టాలీవుడ్ లో రష్మిక కి అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురాం. ఒకవేళ ఫ్యామిలీ స్టార్ లో రష్మిక క్యామియో కన్ఫర్మ్ అయితే ఇది కాస్త సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. గీత గోవిందం తో ఈ జంట చేసిన మ్యాజిక్ అంత త్వరగా మర్చిపోలేం. కాబట్టి వీరిద్దరూ మరోసారి కాసేపైనా అలరిస్తే అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>