HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthbd0d8e33-5a6a-4f03-b689-524b696ca8fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthbd0d8e33-5a6a-4f03-b689-524b696ca8fc-415x250-IndiaHerald.jpgమనకు సంవత్సరమంతా ఎక్కువగా లభించే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండును చాలా మంది కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా ఈ అరటిపండ్లు అందరికి అందుబాటు ధరల్లో లభిస్తూ ఉంటాయి. ఇంకా వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఇక వాటిలో ఎర్ర అరటి పండ్లు కూడా ఒకటి. ఈ ఎర్ర అరటిపండ్ల పైతొక్క ఎర్రగా ఉంటుంది. పైగా ఈ అరటి పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల లాగే ఎర్ర అరటిపండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.ఈ ఎర్ర అరటి పండ్లను క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తీసుకోవడHealth{#}santhanamఎర్ర అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివంటే?ఎర్ర అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివంటే?Health{#}santhanamMon, 27 Nov 2023 22:58:00 GMTమనకు సంవత్సరమంతా ఎక్కువగా లభించే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండును చాలా మంది కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా ఈ అరటిపండ్లు అందరికి అందుబాటు ధరల్లో లభిస్తూ ఉంటాయి. ఇంకా వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఇక వాటిలో ఎర్ర అరటి పండ్లు కూడా ఒకటి. ఈ ఎర్ర అరటిపండ్ల పైతొక్క ఎర్రగా ఉంటుంది. పైగా ఈ అరటి పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల లాగే ఎర్ర అరటిపండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.ఈ ఎర్ర అరటి పండ్లను క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎర్ర అరటిపండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.


దద్దుర్లు, దురద ఇంకా చర్మం పొడిగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి. ఇంకా అలాగే ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా అలాగే ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల సంతాన లేమి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో చాలా మంది కూడా సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఎర్ర అరటిపండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు తగ్గుతాయని త్వరగా సంతానం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఈ ఎర్ర అరటిపండ్లను తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ కూడా చాలా చురుకుగా పని చేస్తుంది. నరాల సంబంధిత సమస్యలు ఇంకా మూర్ఛ వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నాడీ మండల వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. ఈ విధంగా ఎర్ర అరటిపండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఇతర అరటిపండ్లు లాగే వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>