EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp54647e90-2170-406a-b054-2a2c795a77f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp54647e90-2170-406a-b054-2a2c795a77f0-415x250-IndiaHerald.jpgఒక నిజాన్ని నమ్మించాలి అంటే వదంతులు పుట్టించాలి. ఆ వదంతికి మద్దతుగా మరో అంశాన్ని లేవనెత్తాలి. గతంలో 2018 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ పేరును తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఉపయోగించుకుంది. ఇంతకుముందు లగడపాటి సర్వేలకి తిరుగు ఉండేది కాదు. సర్వేలపై అంతటి విశ్వసనీయత కలిగి ఉండేవారు. కానీ 2018 ఎన్నికలకు వచ్చే సరికి ఆయన అంచనా తప్పింది. మరోవైపు రాజగోపాలే బయటకి వచ్చి మరీ సర్వే ఫలితాలను వెల్లడించేవారు. 2018 ఎన్నికల్లో ఆయన సర్వే అంచనాలు నిజం కాకపోయినా.. 2019 ఎన్నికల్లో అయినా జరుగుతాయని కొందరు భావించారు. అంతటtdp{#}March;Lagadapati Rajagopal;Telugu Desam Party;prasanth;Prashant Kishor;TDP;Hanu Raghavapudi;Nijam;Survey;Elections;Telangana;Congressతెలంగాణపై తెలుగుదేశం ప్లాన్‌ ఇదే?తెలంగాణపై తెలుగుదేశం ప్లాన్‌ ఇదే?tdp{#}March;Lagadapati Rajagopal;Telugu Desam Party;prasanth;Prashant Kishor;TDP;Hanu Raghavapudi;Nijam;Survey;Elections;Telangana;CongressMon, 27 Nov 2023 06:01:00 GMTఒక నిజాన్ని నమ్మించాలి అంటే వదంతులు పుట్టించాలి. ఆ వదంతికి మద్దతుగా మరో అంశాన్ని లేవనెత్తాలి. గతంలో 2018 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ పేరును తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఉపయోగించుకుంది. ఇంతకుముందు లగడపాటి సర్వేలకి తిరుగు ఉండేది కాదు. సర్వేలపై అంతటి విశ్వసనీయత కలిగి ఉండేవారు. కానీ 2018 ఎన్నికలకు వచ్చే సరికి ఆయన అంచనా తప్పింది. మరోవైపు రాజగోపాలే బయటకి వచ్చి మరీ సర్వే ఫలితాలను వెల్లడించేవారు.


2018 ఎన్నికల్లో ఆయన సర్వే అంచనాలు నిజం కాకపోయినా.. 2019 ఎన్నికల్లో అయినా జరుగుతాయని కొందరు భావించారు. అంతటి విశ్వాసాన్ని పొందారు. కానీ టీడీపీకి అనుకూలంగా మారి సర్వే ఫలితాలు ఒకటి వస్తే వాటిని మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఫలితం ఆయన ఇప్పుడు సర్వేలకు దూరం కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు నిజం చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.


ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోటీ ఢీ అంటే ఢీ గా ఉంది. ఈ మధ్యలో వచ్చే సర్వే ఫలితాలు ఒక సంస్థ కాంగ్రెస్ అంటే మరోకటి బీఆర్ఎస్ అంటూ ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్తున్నాయి. దీంతో ఏది నమ్మాలో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ సర్వే ఫలితాలు తటస్థ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎవరికి అనుకూలంగా వారు సర్వే ఫలితాలు చెప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.


తెలంగాణ విషయానికొస్తే ఈ సారి ఎన్నికల్లో ఆపార్టీ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతుంది. టీడీపీ అంచనా ఏంటంటే పీకే తన టీంతో ప్లాష్ సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని బీఆర్ఎస్ కు 40కి మించి స్థానాలు రావని ప్రచారం నిర్వహిస్తున్నారు. పీకే ఎవరి తరఫున పనిచేస్తున్నారో తెలియదు కానీ టీడీపీ మాత్రం ప్రశాంత్ కిశోర్ పేరును వాడుకొని ఈ తరహా ప్రచారానికి తెరతీసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>