Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket01670ef3-51f6-4ab9-8779-40d407be1b31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket01670ef3-51f6-4ab9-8779-40d407be1b31-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో అటు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా ఓడిపోయింది. ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకొచ్చిన టీమిండియా ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తడబడింది. దీంతో టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం అటు భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా 2024 టీ20 వరల్డ్ కప్ పైన ఉన్నాయి. ఎందుకంటే 2027 లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ నాటికి జట్టులో సీనియర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీం Cricket{#}Pakistan;Yuva;Cricket;VIRAT KOHLI;ICC T20;World Cup;Hardik Pandya;Rohit Sharmaఆ ఇద్దరు లేకుండా వరల్డ్ కప్పా.. టీమిండియాకు కష్టమే : పాక్ మాజీఆ ఇద్దరు లేకుండా వరల్డ్ కప్పా.. టీమిండియాకు కష్టమే : పాక్ మాజీCricket{#}Pakistan;Yuva;Cricket;VIRAT KOHLI;ICC T20;World Cup;Hardik Pandya;Rohit SharmaSun, 26 Nov 2023 08:00:00 GMTఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో అటు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా ఓడిపోయింది. ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకొచ్చిన టీమిండియా ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తడబడింది. దీంతో టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం అటు భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా 2024 టీ20 వరల్డ్ కప్ పైన ఉన్నాయి. ఎందుకంటే 2027 లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ నాటికి జట్టులో సీనియర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీం లో ఉంటారో లేదో అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. దీంతో కనీసం ఇద్దరూ లెజెండ్స్ కు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి  ఘనమైన వీడ్కోలు సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


 అయితే గత కొంతకాలం నుంచి మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అటు టి20 ఫార్మాట్ కు పూర్తిగా దూరమైపోయారు. హార్థిక్ పాండ్యాకు వరుసగా కెప్టెన్సీ అప్పగిస్తూ వస్తున్న యాజమాన్యం యువ ఆటగాళ్లకు మాత్రమే జట్టులో చోటు కల్పిస్తుంది. దీంతో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు లేకుండా టీమిండియా వరల్డ్ కప్ లో రాణించగలద అనే విషయంపై కూడా అనుమానాలు వస్తున్నాయ్. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం ఈ విషయంపై స్పందించాడు.


 వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉండాల్సిందే అంటూ అభిప్రాయపడ్డాడు వసీం అక్రమ్. ఫామ్ లో ఉన్న వీరిద్దరని ప్రపంచ కప్ కోసం ఎంపిక చేయాలి. ఎందుకంటే టి20లో అనుభవం చాలా అవసరం. కేవలం యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో విజయం సాధించడం ఎంతో కష్టం అవుతుంది. సీనియర్లు జూనియర్లతో కూడిన జట్టు ఎప్పుడూ సమతుల్యంగా ఉంటుంది అంటూ వసీం అక్రమ్ తెలిపాడు. అందుకే ఈ ఇద్దరు సీనియర్ల విషయంలో జట్టు యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోవాలి అంటూ సూచించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>