PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu21c264e1-7d70-45e9-a210-8af32f2bad29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu21c264e1-7d70-45e9-a210-8af32f2bad29-415x250-IndiaHerald.jpgఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా చంద్రబాబుపై దర్యాప్తు సంస్థలతో కేసులు కూడా పెట్టిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దాదాపు 50 రోజులు పైనే జైల్లో ఉంచారు. తాజాగా ఆయనకు బెయిల్ వచ్చినా ఆయన అరెస్టు పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రం మద్దతు లేకుండా జగన్ చంద్రబాబుని అరెస్టు చేయించే సాchandrababu{#}Akkineni Nageswara Rao;Kamma;YCP;TDP;Jagan;Prime Minister;CBN;KCR;CM;Telangana;Congressమోదీ, కేసీఆర్ కలిసే చంద్రబాబుని అరెస్టు చేశారా?మోదీ, కేసీఆర్ కలిసే చంద్రబాబుని అరెస్టు చేశారా?chandrababu{#}Akkineni Nageswara Rao;Kamma;YCP;TDP;Jagan;Prime Minister;CBN;KCR;CM;Telangana;CongressSun, 26 Nov 2023 10:00:00 GMTఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా చంద్రబాబుపై దర్యాప్తు సంస్థలతో కేసులు కూడా పెట్టిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దాదాపు 50 రోజులు పైనే జైల్లో ఉంచారు.


తాజాగా ఆయనకు బెయిల్ వచ్చినా ఆయన అరెస్టు పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రం మద్దతు లేకుండా జగన్ చంద్రబాబుని అరెస్టు చేయించే సాహసం చేస్తారా అని పలువురు విశ్లేషకులు తమ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ప్రధాని మోదీ ఉన్నారని టీడీపీ నాయకులు ప్రారంభం నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. అంతేకాదు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కూడా.


అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారని మోత్కుపల్లి నర్సింహులతో పాటు తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు జరిగిందని తుమ్మల ఆరోపించారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. వనస్థలిపురంలో జరిగిన కమ్మ సంఘం ఆత్మీయ సమావేశంలో మధు యాస్కీ గౌడ్ తో కలిసి పాల్గొని ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకోవడం లేదు. దీంతో టీడీపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఖమ్మంలో తుమ్మల టీడీపీ జెండా ధరించారు. కోదాడలో ఉత్తమ్ టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరారు. టీడీపీ ఓట్లు రాబట్టాలంటే చంద్రబాబు కి మద్దతు తప్పక తెలపాల్సిన పరిస్థితి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>