MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc57dd629-9b19-4a4a-acb8-9494e5980376-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc57dd629-9b19-4a4a-acb8-9494e5980376-415x250-IndiaHerald.jpg'అర్జున్ రెడ్డి' మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'యానిమల్' ట్రైలర్ పై పాన్ ఇండియా హీరో, డార్లింగ్ ప్రభాస్ తనదైన రివ్యూ ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో 'యానిమల్' ట్రైలర్ ని షేర్ చేస్తూ.." ట్రైలర్ అదిరిపోయింది. మెంటల్ మాస్ అంతే. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మూవీ టీం కి నా అభినందనలు" అంటూ tollywood{#}Anil Kapoor;maruti;Pranay;Darling;Chitram;kushi;Kushi;Heroine;media;sandeep;rashmika mandanna;Father;Mass;bollywood;Prabhas;India;Cinema'యానిమల్' ట్రైలర్ పై ప్రభాస్ .. షాకింగ్ కామెంట్స్..!?'యానిమల్' ట్రైలర్ పై ప్రభాస్ .. షాకింగ్ కామెంట్స్..!?tollywood{#}Anil Kapoor;maruti;Pranay;Darling;Chitram;kushi;Kushi;Heroine;media;sandeep;rashmika mandanna;Father;Mass;bollywood;Prabhas;India;CinemaSun, 26 Nov 2023 16:40:31 GMT'అర్జున్ రెడ్డి' మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'యానిమల్' ట్రైలర్ పై పాన్ ఇండియా హీరో, డార్లింగ్ ప్రభాస్ తనదైన రివ్యూ ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో 'యానిమల్' ట్రైలర్ ని షేర్ చేస్తూ.." ట్రైలర్ అదిరిపోయింది. మెంటల్ మాస్ అంతే. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మూవీ టీం కి నా అభినందనలు" అంటూ రాస్కొచ్చారు. 

దీంతో ప్రభాస్ 'యానిమల్' ట్రైలర్ పై చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సందీప్ వంగతో మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, ఆ మూవీని త్వరగా పట్టాలెక్కించండి.. అంటూ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. 'యానిమల్' మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో 'స్పిరిట్' అనే సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సలార్', 'కల్కి2898AD', మారుతి సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటిలో 'సలార్' త్వరలోనే రిలీజ్ కాబోతోంది. 'కల్కి 2898AD', మారుతి సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. 

ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసి 'స్పిరిట్' మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు డార్లింగ్. ఇక 'యానిమల్'  విషయానికొస్తే.. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ ఇందులో రణ్ బీర్ తండ్రి పాత్ర పోషించగా, బాబి డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సుమారు 3 గంటల 21 నిమిషాల నిడివితో రాబోతోంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1 పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>