MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa46bf23-4c0c-411c-83c2-f62ebd7c4858-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa46bf23-4c0c-411c-83c2-f62ebd7c4858-415x250-IndiaHerald.jpg రజనీకాంత్, కమలహాసన్ ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తమ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అగ్ర హీరోలతో పోటీపడి మరి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమాలో నటిస్తుండగా.. కమల్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2'(Indian 2) చేస్తున్నారు. సుమారు 21 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఒకే చోట కలుసుకోవడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే, tollywood{#}lyca productions;shankar;kushi;Kushi;Lokesh;Lokesh Kanagaraj;Indian;Cinema21 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న రజనీకాంత్ కమల్ హాసన్..!!21 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న రజనీకాంత్ కమల్ హాసన్..!!tollywood{#}lyca productions;shankar;kushi;Kushi;Lokesh;Lokesh Kanagaraj;Indian;CinemaSun, 26 Nov 2023 17:05:00 GMT రజనీకాంత్, కమలహాసన్ ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తమ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అగ్ర హీరోలతో పోటీపడి మరి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమాలో నటిస్తుండగా.. కమల్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2'(Indian 2) చేస్తున్నారు. సుమారు 21 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఒకే చోట కలుసుకోవడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే, 

ఇండియన్ 2' కోసం కమలహాసన్, తలైవార్ 170కోసం రజనీకాంత్ చెన్నైలోని ఓ స్టూడియోలో కలుసుకున్నారు. ఒకే సమయంలో ఒకే స్టూడియోలో వీరిద్దరి సినిమా షూటింగ్స్ జరగడం విశేషంగా మారింది. ఇక స్టూడియోలో కలుసుకున్న రజనీకాంత్, కమలహాసన్ ఒకరినొకరు మర్యాదపూర్వకంగా ప్రేమగా పలకరించుకున్నారు. సుమారు 21 ఏళ్ల తర్వాత ఈ అరుదైన మూమెంట్ చోటు చేసుకోవడంతో ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. సరిగ్గా 21 ఏళ్ల కింద కమల్ హాసన్,

రజనీకాంత్ ఒకే స్టూడియోలో కలిశారు. రజనీకాంత్ 'బాబా', కమల్ హాసన్ 'పంచతంత్రం' సినిమా షూటింగ్స్ చెన్నైలో ఒకే ప్లేస్ లో జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆ క్రేజీ మూమెంట్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసి తెగ మురిసిపోతున్నారు. ఇక రీసెంట్ గా 'జైలర్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు రజినీకాంత్. అటు కమల్ హాసన్ గత ఏడాది లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'విక్రమ్'  మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇక 'తలైవార్ 170' ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. TJ జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. 

 


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>