PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brrelakka--sireesha5eabcd3a-423d-4e04-9497-1578f74bb4cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brrelakka--sireesha5eabcd3a-423d-4e04-9497-1578f74bb4cc-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఫోన్ చూస్తే ఎక్కడ చూసినా ఒకటే టాపిక్.. అదే బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒక చిన్న వీడియోతో బర్రెలక్క అలియాస్ శిరీష అనే యువతీ ఒక రేంజ్ లో సెన్సేషన్ సృష్టించింది.ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేసింది. ఎప్పుడైతే నామినేషన్ వేసిందో అప్పటినుంచి ఆమె గురించి తెలుసుకోవాలని జనాలు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక శిరీష డిగ్రీ చదివBrrelakka - Sireesha{#}Smart phone;Degree;District;job;Yevaru;Father;marriage;News;Houseబర్రెలక్కపై విరుచుకుపడ్డ ఆమె తండ్రి?బర్రెలక్కపై విరుచుకుపడ్డ ఆమె తండ్రి?Brrelakka - Sireesha{#}Smart phone;Degree;District;job;Yevaru;Father;marriage;News;HouseSat, 25 Nov 2023 20:40:00 GMTఇప్పుడు ఫోన్ చూస్తే ఎక్కడ చూసినా ఒకటే టాపిక్.. అదే బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒక చిన్న వీడియోతో బర్రెలక్క అలియాస్ శిరీష అనే యువతీ ఒక రేంజ్ లో సెన్సేషన్ సృష్టించింది.ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేసింది. ఎప్పుడైతే నామినేషన్ వేసిందో అప్పటినుంచి ఆమె గురించి తెలుసుకోవాలని జనాలు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక శిరీష డిగ్రీ  చదివి.. ఉద్యోగం కోసం ప్రయత్నించి.. ఉద్యోగం లేక బర్రెలను కాసుకుంటున్నట్లు ఆమె ఓ వీడియోలో తెలిపింది. ఇక గత కొన్నిరోజులుగా ఆమెపై, ఆమె తండ్రిపై కూడా దాడులు జరిగాయి. అయితే ఇదంతా నచ్చని ఆమె తండ్రి.. ఆమె గురించి అసలు సిసలైన నిజాలను ఒక వీడియో ద్వారా చెప్పి షాక్ ఇచ్చాడు.


తెలుస్తున్న సమాచారం ప్రకారం.. శిరీషకు అతని తండ్రికి సత్సబంధాలు లేవని సమాచారం. ఇప్పటి దాకా నా తండ్రి నన్ను వదిలేశాడు.. మా అమ్మనే కష్టపడి పెంచింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలకూ ఆమె తండ్రి బాధతో ఫైర్ అయ్యాడు.తాజాగా ఒక వీడియోలో బర్రెలక్క తండ్రి మాట్లాడుతూ.. ”  శిరీష పెళ్లి నేను ఎంతో ఘనంగా చేశాను.. మా ఊర్లో ఎవరు చేయనంత ఘనంగా చేశాను. కార్లు, ఫుడ్ అంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను. మొగుడితో గొడవపడి ఇంటికి తిరిగి వచ్చి.. సిగ్గులేకుండా బర్రెలు కాసుకున్నావ్.. ఆ బర్రెలు నీకు ఎవరు ఇచ్చారు..ఏమాత్రం సిగ్గు సరం లేకుండా జనాలకు బర్రెలక్క అని చెప్తున్నావ్.. నీకెక్కడివి బర్రెలు. నేను కొన్నాను. ఇప్పుడు నేను కష్టపడ్డాను అని చెప్తున్నావ్.. ఇంత విషం పోసుకొని చావు. నిన్ను చదివించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు.. పెళ్లి చేశా .. ఇల్లు కట్టా.. ఒక్క రూపాయి అప్పు లేకుండా నీ పెళ్లి చేసి పంపిస్తే.. నేను పెంచలేదని ఎలా చెప్తావ్. పని చేయడానికి.. ఇంటికి ఒక మహిళ వస్తే అనుమానిస్తావా..? అలాంటి పనులు చేస్తే.. రెండు ఇళ్లు ఎలా కట్టేవాడిని. నన్ను అందరిముందు ఇలా చేస్తావా.. ఇది నీ బాగోతం” అంటూ ఆయన ఫైర్ అయ్యాడు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>