MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-a-mix-of-al-pacino-de-niro-kamal-haasan-svre8ff9b6e-220b-4cc7-af25-18d06814bfdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-a-mix-of-al-pacino-de-niro-kamal-haasan-svre8ff9b6e-220b-4cc7-af25-18d06814bfdf-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలranbir{#}Crush;Prabhas;Kannada;Industry;Hero;Indian;Telugu;December;cinema theater;Interview;Tamil;sandeep;India;Heroine;Hindi;Cinemaసందీప్ నెక్స్ట్ మూవీలో నేను కూడా ఓ పాత్ర చేయబోతున్నాను... రన్బిర్ కపూర్..!సందీప్ నెక్స్ట్ మూవీలో నేను కూడా ఓ పాత్ర చేయబోతున్నాను... రన్బిర్ కపూర్..!ranbir{#}Crush;Prabhas;Kannada;Industry;Hero;Indian;Telugu;December;cinema theater;Interview;Tamil;sandeep;India;Heroine;Hindi;CinemaSat, 25 Nov 2023 08:34:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్  గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా హీరో అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రబ్బీర్ మాట్లాడుతూ ... సందీప్ రెడ్డి తన తర్వాతి సినిమాను ప్రభాస్ తో చేయబోతున్నాడు. ఆ మూవీ లో నేను ఒక చిన్న పాత్ర చేయబోతున్నాను.  ప్రభాస్ హీరోగా సందీప్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం నాకు దక్కడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అని రబ్బీర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా యానిమల్ బృందం ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసే రన్ టైమ్ ను లాక్ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 3 గంటల 21 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>