Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/auisi12089388-b2fa-47c2-bd17-b4beeebd233b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/auisi12089388-b2fa-47c2-bd17-b4beeebd233b-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ హాట్ టాపిక్గా మారిపోతున్నారు భారత సంతతి క్రికెటర్లు. విదేశీ జట్ల తరఫున ఆడుతూ.. తమ ఫామ్ తో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున రచన్ రవీంద్ర, నెదర్లాండ్స్ జట్టులో ఆర్యన్ దత్, విక్రమ్ సింగ్, తేజ నిడుమనూరు లాంటి ఆటగాళ్లు ఎంత మంచి ప్రదర్శన చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల విశాఖపట్నం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20 సిరీస్ లో భారత సంతతికి చెందిన మరో ఆటగాడుAuisi{#}aryan;Netherlands;New Zealand;Driver;Punjab;Vishakapatnam;september;ICC T20;INTERNATIONAL;World Cup;Australia;Father;vikram;India;tejaటీమిండియాను దెబ్బ కొట్టేందుకు రెడీ అయిన.. మరో భారత సంతతి ప్లేయర్?టీమిండియాను దెబ్బ కొట్టేందుకు రెడీ అయిన.. మరో భారత సంతతి ప్లేయర్?Auisi{#}aryan;Netherlands;New Zealand;Driver;Punjab;Vishakapatnam;september;ICC T20;INTERNATIONAL;World Cup;Australia;Father;vikram;India;tejaFri, 24 Nov 2023 13:30:00 GMTఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ హాట్ టాపిక్గా మారిపోతున్నారు భారత సంతతి క్రికెటర్లు. విదేశీ జట్ల తరఫున ఆడుతూ.. తమ ఫామ్ తో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున రచన్ రవీంద్ర, నెదర్లాండ్స్ జట్టులో ఆర్యన్ దత్, విక్రమ్ సింగ్, తేజ నిడుమనూరు లాంటి ఆటగాళ్లు ఎంత మంచి ప్రదర్శన చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే ఇటీవల విశాఖపట్నం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20 సిరీస్ లో భారత సంతతికి చెందిన మరో ఆటగాడు ఆడాడు అన్నది తెలుస్తుంది. అతని పేరు తన్వీర్ సంగ్. అతను ఇటీవల సెప్టెంబర్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వరకు రెండు వన్డేలు రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అయితే అతను రైట్ హ్యాండ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ ఆల్రౌండర్ కావడం గమనార్హం. 2 t20 మ్యాచ్ లలో ఐదు వికెట్లు.. రెండు వన్డే మ్యాచ్ లలో రెండు వికెట్లు తీశాడు ఈ బౌలర్.


 కాగా ఇటీవల ఇండియా తో విశాఖ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కూడా అతను నాలుగో ఓవర్లు బౌలింగ్ చేసి 47 పరుగులు ఇచ్చి కాస్త ఎక్కువ పరుగులు సమర్పించుకున్న.. రెండు వికెట్లు తీసి మాత్రం సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్ లో విరోచితంగా పోరాడిన టీమిండియా విజయం సాధించింది. కాగా 21 ఏళ్ల తన్వీర్ జలంధర్, ఉపనిత్ దంపతులకు సిడ్నీలో జన్మించాడు. భారతీయ మూలం ఉన్న ఈ ఫ్యామిలీ ఇక సిడ్నీలో  స్థిరపడడంతో అతను మొత్తం సిడ్నీలోనే పెరిగాడు. కాగా తన్విర్ తండ్రి జలంధర్ పంజాబ్  సమీపంలో ఒక గ్రామానికి చెందిన వాడు. ఇక అతని తండ్రి సిడ్నీలో టాక్సీ డ్రైవర్ గా పనిచేసే వాడు. తల్లి అకౌంటెంట్గా పని చేసేది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>