MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood037549d0-7cc3-42a4-887c-73baed194493-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood037549d0-7cc3-42a4-887c-73baed194493-415x250-IndiaHerald.jpgప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తీసే ప్రతీ సినిమాలో ప్రేమ కథ కచ్చితంగా ఉంటుంది. అలాంటి ప్రేమ నేపథ్యంలోనే పూర్తిగా చిత్రం తీస్తే అదే మాధవే మధుసూదన. అందమైన ప్రేమ కథా చిత్రాన్ని మనసుకు హత్తుకునేలా తీశారు బొమ్మదేవర రామచంద్ర రావు. తేజ్ బొమ్మదేవర హీరోగా పరిచయం అయిన ఈ చిత్రంలో రిషికి లొక్రే‌ హీరోయిన్‌గా నటించారు. సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం బొమ్మదేవర రామచంద్ర రావు. ఇప్పుడు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 24న వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. tollywood{#}Shiva;lord siva;Prema Katha;Train;Ram Madhav;ravi anchor;prema;Heroine;Chitram;Father;Love;Girl;Hero;Cinema;Novemberమాధవే మధుసూదన రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?మాధవే మధుసూదన రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?tollywood{#}Shiva;lord siva;Prema Katha;Train;Ram Madhav;ravi anchor;prema;Heroine;Chitram;Father;Love;Girl;Hero;Cinema;NovemberFri, 24 Nov 2023 17:35:00 GMTప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తీసే ప్రతీ సినిమాలో ప్రేమ కథ కచ్చితంగా ఉంటుంది. అలాంటి ప్రేమ నేపథ్యంలోనే పూర్తిగా చిత్రం తీస్తే అదే మాధవే మధుసూదన. అందమైన ప్రేమ కథా చిత్రాన్ని మనసుకు హత్తుకునేలా తీశారు బొమ్మదేవర రామచంద్ర రావు. తేజ్ బొమ్మదేవర హీరోగా పరిచయం అయిన ఈ చిత్రంలో రిషికి లొక్రే‌ హీరోయిన్‌గా నటించారు. సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం బొమ్మదేవర రామచంద్ర రావు. ఇప్పుడు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 24న వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
మాధవ్ (తేజ్ బొమ్మదేవర) స్నేహితులు రవి (జోష్ రవి), శివ (శివ)లతో కలిసి జాలీగా తిరుగుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. అలా తిరుగుతున్న కొడుకుని చూసి బాధపడుతుంటారు తల్లిదండ్రులు. ఆఫీస్‌ బాధ్యతలు చూసుకోమని మాధవ్‌ను బెంగళూరు వెళ్లమని చెబుతుంది తల్లి (ప్రియ). తండ్రి (జయ ప్రకాష్) కూడా వెళ్లమని సలహా ఇస్తాడు. అలా బెంగళూరుకు వెళ్లాల్సిన మాధవ్ వైజాగ్ ట్రైన్ ఎక్కి అరుకు చేరుతాడు. మార్గమధ్యంలో ఓ రైల్వే స్టేషన్‌లో అమ్మాయి (రిషికి లొక్రే)ని చూస్తాడు. కానీ ఆమె ఎవరికీ కనిపించదు. కేవలం మాధవకే కనిపిస్తుంది? అసలు ఆ అమ్మాయికి మాధవకి ఉన్న సంబంధం ఏంటి? ఆరాధ్య అంటూ ఆ అమ్మాయి వెనకాల ఎందుకు వెళ్తాడు? వీరిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి? ప్రేమ కోసం ఈ ఇరువురు చేసిన త్యాగాలేంటి? అనేది కథ.

నటీనటులు
తేజ్ బొమ్మదేవరకు మొదటి సినిమా. అయినా కూడా ఎక్కడా ఆ తేడాను చూపించలేదు. ఎంతో నేచురల్‌గా నటించినట్టు అనిపిస్తుంది. ప్రేమికుడిగా, జాలీగా తిరిగే యువకుడిగా, పక్కింటి అబ్బాయిలా కనిపించి మెప్పించాడు. డ్యాన్సులు, డైలాగ్ డెలివరీలో మంచి నటనను కనబర్చాడు. ఇక హీరోయిన్‌గా కనిపించిన రిషికి అందరినీ ఆకట్టుకుంటుంది. తెరపై చలాకీగా కనిపించింది. అందంగానూ కనిపించింది. హీరోయిన్ తండ్రిగా కనిపించిన బొమ్మదేవర రామచంద్ర రావు ఎమోషనల్ సీన్లతో ఏడిపిస్తాడు. ఫ్రెండ్స్ పాత్రలు నవ్విస్తాయి.

విశ్లేషణ
మాధవే మధుసూదన అనే టైటిల్‌లో ఎంత పాజిటివిటీ ఉందో సినిమాలోనూ అంతే పాజిటివిటీ ఉంది. ఎక్కడా వల్గారిటీని చూపించలేదు. అలాంటి సీన్ల జోలికి పోకుండా తనకేం కావాలో అది మాత్రమే తీశాడు దర్శకుడు. ఆ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. కథ, కథనాలు ఎలా ఉన్నా కూడా వాటి నుంచి గాడి తప్పకుండా చూసుకున్నాడు.

ప్రేమ అంటే సమస్యలు, సంఘర్షణలు కామన్. కానీ ఆ సమస్యలు, సంఘర్షణలు ఎవరితో.. ఎవరి మధ్య అన్నదే ఇంపార్టెంట్. అక్కడే సినిమా సినిమాకు తేడా ఉంటుంది. అన్ని చిత్రాల్లో ప్రేమ ఉన్నా కూడా.. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు. ఈ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండడు. విధి విలన్‌గా కనిపిస్తుంది. ప్రేయసికి ఇచ్చిన మాట కోసం ప్రియుడు ఏం చేశాడు? ఏం చేయగలడు.. ప్రియుడు లేకుండా ప్రేయసి ఎలా ఉంటుంది? అనేది చక్కగా చూపించారు.

ప్రథమార్దం కాస్త జాలీగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం కొంచెం నీరసంగా, నిదానంగా సాగినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త తగ్గించినా బాగుండేది. నిడివి సమస్య కూడా అక్కడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకేలా ఉన్నాయి. హీరో తేజ్ డాన్స్, ఫైట్స్ చేయటంలొ చాలా కష్ట పడ్డాడు. మంచి నటన కనపరిచాడు. విజువల్స్ అందంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్: 3/5



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>