Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaitanya-and-shiva-nirvana-plans-another-project3fdac27d-1b7a-462f-a016-076afb579662-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaitanya-and-shiva-nirvana-plans-another-project3fdac27d-1b7a-462f-a016-076afb579662-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగ చైతన్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపిస్తాడని తెలిసిందే. సినిమా కోసం చైతన్య మేకోవర్ Naga Chaitanya Tandel{#}chandu;Prize;Geetha Arts;Savyasachi;Sai Pallavi;Chaitanya;Naga Chaitanya;Success;Love Story;Bunny Vas;producer;Producer;India;News;Director;Heroine;Cinemaనాగ చైతన్య తండేల్ బడ్జెట్ ఎంతో తెలుసా..?నాగ చైతన్య తండేల్ బడ్జెట్ ఎంతో తెలుసా..?Naga Chaitanya Tandel{#}chandu;Prize;Geetha Arts;Savyasachi;Sai Pallavi;Chaitanya;Naga Chaitanya;Success;Love Story;Bunny Vas;producer;Producer;India;News;Director;Heroine;CinemaFri, 24 Nov 2023 10:42:00 GMTఅక్కినేని నాగ చైతన్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపిస్తాడని తెలిసిందే. సినిమా కోసం చైతన్య మేకోవర్ అక్కినేని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తున్నారట నిర్మాత బన్నీ వాసు. నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటివరకు పెట్టని బడ్జెట్ తో సినిమా వస్తుందని అంటున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా కోసం బన్నీ వాసు 100 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారని టాక్. అదే నిజమైతే నాగ చైతన్య కెరీర్ లో ఇది మొదటి 100 కోట్ల సినిమా అని చెప్పొచ్చు. నాగ చైతన్య కెరీర్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భం కూడా లేదు అలాంటి హీరోతో అంత బడ్జెట్ తో సినిమా అంటే పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. అయితే రిస్క్ అయినా సరే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో అనుకున్న బడ్జెట్ పెట్టేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

తప్పకుండా నాగ చైతన్య కెరీర్ లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఆల్రెడీ సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా చేసిన నాగ చైతన్య ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో సినిమాతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. నాగ చైతన్య చందు మొండేటి ఇదివరకు ప్రేమం, సవ్యసాచి సినిమాలు చేశారు. తండేల్ తో పాన్ ఇండియా లెవెల్ లో వారి సత్తా చాటనున్నారు.

నాగ చైతన్య లుక్ చందు మొండేటి మీద ఉన్న నమ్మకం చూస్తుంటే సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంచనా వేయొచ్చు. సినిమాను 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>