Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarakf086f186-bb80-4622-bd90-6af6d872df1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarakf086f186-bb80-4622-bd90-6af6d872df1e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాతకు తగ్గ మనవడిగా ఇప్పటికే రుజువు చేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే మొన్నటి వరకు టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ క్రేజ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేశం మొత్తం పాకిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే విదేశాల్లో కూడా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన సినీ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు తారక్. ఈ మూవీలో అతిలోక సుందరి దివంగత నటిTarak{#}Janhvi Kapoor;Sridevi Kapoor;Jr NTR;koratala siva;roshan;January;Heroine;Fidaa;Audience;Alia Bhatt;war;India;bollywood;NTR;Hero;Cinemaతారక్ అన్న ప్లీజ్.. ఆ హీరోయిన్ తో నటించకు.. ఫ్యాన్స్ సలహా?తారక్ అన్న ప్లీజ్.. ఆ హీరోయిన్ తో నటించకు.. ఫ్యాన్స్ సలహా?Tarak{#}Janhvi Kapoor;Sridevi Kapoor;Jr NTR;koratala siva;roshan;January;Heroine;Fidaa;Audience;Alia Bhatt;war;India;bollywood;NTR;Hero;CinemaFri, 24 Nov 2023 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాతకు తగ్గ మనవడిగా ఇప్పటికే రుజువు చేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే మొన్నటి వరకు టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ క్రేజ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేశం మొత్తం పాకిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే విదేశాల్లో కూడా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన సినీ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు తారక్.


 ఈ మూవీలో అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత త్రిబుల్ ఆర్ తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను నిలబెట్టుకునేందుకు.. అటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించేందుకు తారక్ రెడీ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో వార్ 2 అనే సినిమా చేయబోతున్నాడు. జనవరి నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ మూవీలో తారక్ కు జోడిగా శార్వారి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆమెకు పెద్దగా బాలీవుడ్లో క్రేజ్ లేదు. ఇక ఈ విషయంలో తారక్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ కు ఒక సలహా ఇస్తున్నారు. పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్ ఎంపిక చేసుకోవడానికి బదులుగా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎంపిక చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. శ్రద్ధ కపూర్, కియారా, అలియా భట్ లాంటి హీరోయిన్లు తారక్ తో నటిస్తే బాగుంటుందని.. అలాంటి వాళ్లకు ఆఫర్లు ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే శార్వారి ఇక తారక్ సరసన నటిస్తుంది అన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>