Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle735818b1-0ced-48d0-ad73-7a8831c099eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle735818b1-0ced-48d0-ad73-7a8831c099eb-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మీక హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందినదో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా రష్మిక అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో కలిసి ఈమె నటించిన తాజా చిత్రం యానిమాల్. ఈ సినిమా పానsocialstars lifestyle{#}Arjun;Ranbir Kapoor;Balakrishna;sandeep;rashmika mandanna;Hero;Reddy;bollywood;Chitram;Success;India;Director;Cinemaపుష్ప-2 కధ రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో...!!పుష్ప-2 కధ రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో...!!socialstars lifestyle{#}Arjun;Ranbir Kapoor;Balakrishna;sandeep;rashmika mandanna;Hero;Reddy;bollywood;Chitram;Success;India;Director;CinemaFri, 24 Nov 2023 21:39:00 GMTసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మీక హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందినదో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా రష్మిక అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో కలిసి ఈమె నటించిన తాజా చిత్రం యానిమాల్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బాలకృష్ణ టాక్ షోకు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ రష్మికను ప్రశ్నిస్తూ పుష్ప 2 సినిమా గురించి చెప్పమని అడగడంతో ఈమె చెప్పను అంటూ తల ఊపారు ఇక రణబీర్ కపూర్ మాత్రం పుష్ప 2 సినిమా స్టోరీ గురించి అసలు విషయం బయట పెట్టారు.  నేను సందీప్ రెడ్డి గారు షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు పుష్ప 2 స్టోరీ ఏమై ఉంటుంది అంటూ మాకు మేము ఎన్నో ఊహించుకొని కథలుగా రాసుకునే వాళ్ళం అంటూ రణబీర్ తెలిపారు. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు చనిపోతుందని దాంతో పుష్పరాజ్ రివేంజ్ తీర్చుకోబోతారని ఇక పుష్పరాజ్ ప్రాణ స్నేహితులకు కేశవ కూడా చనిపోతారు అంటూ మా అంతట మేము ఎన్నో ఊహగానాలు కథలు రాసుకునే వాళ్ళం అంటూ వారు ఊహించుకున్నటువంటి పుష్ప 2 గురించి ఈ సందర్భంగా రణబీర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా రణబీర్ చేసిన కామెంట్స్ కనుక చూస్తే పుష్పట్టు సినిమా కోసం వీళ్ళు కూడా ఎంత ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>