Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle08619f3b-9106-407e-a6d8-8f971e99e147-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle08619f3b-9106-407e-a6d8-8f971e99e147-415x250-IndiaHerald.jpgపంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఆదికేశవ సినిమా నేడు (నవంబర్ 24) థియేటర్లలో రిలీజ్ అయింది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆదికేశవ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఖరారైంది.ఆదికేశవ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. డిసెంబర్ ఆఖర్లోsocialstars lifestyle{#}tanikella bharani;Star maa;sithara;Kumaar;Panjaa;srikanth;Mass;Hero;Music;December;Reddy;Heroine;Cinema'ఆదికేశవ' డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న సంస్థ...!!'ఆదికేశవ' డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న సంస్థ...!!socialstars lifestyle{#}tanikella bharani;Star maa;sithara;Kumaar;Panjaa;srikanth;Mass;Hero;Music;December;Reddy;Heroine;CinemaFri, 24 Nov 2023 22:49:00 GMTపంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఆదికేశవ సినిమా నేడు (నవంబర్ 24) థియేటర్లలో రిలీజ్ అయింది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆదికేశవ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఖరారైంది.ఆదికేశవ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. డిసెంబర్ ఆఖర్లో ఆదికేశవ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే, ఆదికేశవ శాటిలైట్ రైట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.ఆదికేశవ సినిమాలో యాక్షన్ బాగానే ఉన్నా.. కథ రొటీన్‍గా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఓ ఫార్మాట్‍లో సినిమా సాగిందని టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్ శ్రీలీల హైలైట్‍గా నిలిచారు. రెండు వేరియషన్స్ ఉన్న పాత్రలో హీరో వైష్ణవ్ తేజ్ కూడా మెప్పించారు. అయితే, ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సీన్లపై ట్రోల్స్ కూడా జోరుగా వస్తున్నాయి.

ఆదికేశవ చిత్రంలో జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, అపర్ణా దాస్, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.కాగా, ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు పంజా వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే భారీ హిట్ కొట్టారు. అయితే, ఆ తర్వాత ఆ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు విఫలమయ్యాయి. ఆదికేశవ సినిమాతో యాక్షన్ మోడ్‍లోకి మారారు వైష్ణవ్. ఈ చిత్రంతో మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>