PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-telangana-kcr-026cc023-065c-409e-b7c5-7afc40a1f82a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-telangana-kcr-026cc023-065c-409e-b7c5-7afc40a1f82a-415x250-IndiaHerald.jpgఇపుడు విషయం ఏమిటంటే గజ్వేలు, కామారెడ్డిలో పోటీచేస్తున్న కేసీయార్ ను రేవంత్, ఈటల ఓడిస్తారని ఎవరు గ్యారెంటీగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కన్నా కేసీయార్ పెద్ద పర్సనాలిటి అనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా పూర్తి అధికారాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. అయితే ఏదైనా అద్భుతంజరిగితే మాత్రం కేసీయార్ ఎక్కడో ఒక చోట దెబ్బతినక తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయం ఇలాగుంటే తాజాగా కేటీయార్ వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. ktr telangana kcr {#}Eatala Rajendar;Kanna Lakshminarayana;Telangana Chief Minister;Kamareddy;Sircilla;Air;Revanth Reddy;KCR;Congress;CM;Reddy;Smart phone;Yevaru;Audioహైదరాబాద్ : కేటీయార్ కు డేంజర్ బెల్స్ ?హైదరాబాద్ : కేటీయార్ కు డేంజర్ బెల్స్ ?ktr telangana kcr {#}Eatala Rajendar;Kanna Lakshminarayana;Telangana Chief Minister;Kamareddy;Sircilla;Air;Revanth Reddy;KCR;Congress;CM;Reddy;Smart phone;Yevaru;AudioFri, 24 Nov 2023 09:00:00 GMT

తొందరలో జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరగబోతున్నాయా ? అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉండటానికి తెలంగాణాలో 119 నియోజకవర్గాలు ఉన్నా కొన్ని నియోజకవర్గాలను  మాత్రమే జనాలు బాగా ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాంటి వాటిలో కేసీయార్ పోటీచేస్తున్న గజ్వేలు, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్, ఈటల రాజేందర్ పోటీచేస్తున్న హుజూరాబాద్, కేటీయార్ పోటీచేస్తున్న సిరిసిల్ల లాంటివి ఉన్నాయి.





ఇపుడు విషయం ఏమిటంటే గజ్వేలు, కామారెడ్డిలో పోటీచేస్తున్న కేసీయార్ ను రేవంత్, ఈటల ఓడిస్తారని ఎవరు గ్యారెంటీగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కన్నా కేసీయార్ పెద్ద పర్సనాలిటి అనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా పూర్తి అధికారాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. అయితే ఏదైనా అద్భుతంజరిగితే మాత్రం కేసీయార్ ఎక్కడో ఒక చోట దెబ్బతినక తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయం ఇలాగుంటే తాజాగా కేటీయార్ వ్యవహారం ఒకటి వెలుగుచూసింది.





అదేమిటంటే సిరిసిల్ల నియోజకవర్గంలోని నేతలతో మాట్లాడుతు కష్టపడి పనిచేయండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి, ఓడిపోతామనే ప్రచారాన్ని నమ్మద్దండని బతిమలాడుకున్నారు. నేతలకు కేటీయార్ ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో లీకైంది. దాంతో సిరిసిల్లలో కేటీయార్ గెలుపు కూడా అనుమానమేనా అనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. నిజానికి కేటీయార్  మీద నియోజకవర్గంతో పాటు పార్టీలో కూడా బాగా వ్యతిరేకత ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే సీఎం అనే ట్యాగ్ ఉంది కాబట్టి డైరెక్టుగా ఎవరు బయటపడటంలేదు.





ఇపుడు బీఆర్ఎస్ గెలుపు కష్టమని, కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందని సర్వేల్లో వెల్లడవుతున్నాయి. దాంతో జనాలు, నేతల్లో కూడా ధైర్యం వస్తున్నట్లుంది. అందుకనే కేటీయార్  ఓడిపోతారేమో అనే చర్చను బహిరంగంగానే చేస్తున్నారు. ఆ విషయమే కేటీయార్  దృష్టికి రావటంతో నేతలకు ఫోన్లు చేసి బయట జరిగే ప్రచారాన్ని నమ్మద్దని బతిమలాడుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డి రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. అలాగే కాంగ్రెస్ అనుకూల గాలి వీస్తున్న కారణంగా బాగా పుంజుకుంటున్నట్లు టాక్. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>