MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sound-party2cb1b3b7-b394-4c07-ac4a-5170b08f00ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sound-party2cb1b3b7-b394-4c07-ac4a-5170b08f00ab-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ విన్నర్ నటుడు వీజే సన్నీ హీరోగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ సినిమాలో హృతిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటించింది. మూన్ మీడియా ప్రొడక్షన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను జయశంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. శివన్నారాయణ, కమెడియన్ పృథ్విలు కీలక పాత్రలో నటించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లుగా వ్యవహరించారు. ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమsound party{#}Kumaar;srinivas;Comedian;vishwa;sree;Winner;MLA;Party;Chitram;Father;ravi anchor;Heroine;Audience;Comedy;Cinema;mediaసౌండ్ పార్టీ మూవీ రివ్యూ!సౌండ్ పార్టీ మూవీ రివ్యూ!sound party{#}Kumaar;srinivas;Comedian;vishwa;sree;Winner;MLA;Party;Chitram;Father;ravi anchor;Heroine;Audience;Comedy;Cinema;mediaFri, 24 Nov 2023 13:42:00 GMTబిగ్ బాస్ విన్నర్ నటుడు వీజే సన్నీ హీరోగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ సినిమాలో హృతిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటించింది. మూన్ మీడియా ప్రొడక్షన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను జయశంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. శివన్నారాయణ, కమెడియన్ పృథ్విలు కీలక పాత్రలో నటించారు.  రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లుగా వ్యవహరించారు. ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా అసలు కథ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

కథ:

కష్టపడకుండా ధనవంతులు అవ్వాలి అనుకున్న ఆ తండ్రి కొడుకుల కథ ఈ సౌండ్ పార్టీ సినిమా. తండ్రి కుబేర్ కుమార్, కొడుకు డాలర్ కుమార్ లు సౌండ్ పార్టీలు అవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం అన్ని రకాల వ్యాపారాలను చేస్తూ ఉంటారు. దాంతో మొత్తం అన్ని అప్పులే మిగులుతాయి. అటువంటి సమయంలో కుబేర్ కుమార్ డాలర్ కుమార్ లకు ఒక ఆఫర్ వస్తుంది. అదేమిటంటే ఎమ్మెల్యే వరప్రసాద్ కొడుకు చేసిన తప్పుని మీదకు వేసుకొని జైలుకు వెళ్లేందుకు సిద్ధపడతారు. అందుకు గాను వాళ్లకు రెండు కోట్ల డబ్బులు వస్తాయి. డబ్బు కోసం ఆశపడి తప్పు ఏంటో తెలుసుకోకుండా జైలుకు వెళ్తారు. అయితే వాళ్లు జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు?ఆ రెండు కోట్లు ఏం చేశారు? ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

 విశ్లేషణ:

వీజే సన్నీ, శివన్నారాయణలు ఈ సినిమాను తమ భుజాల మీద మోశారని చెప్పవచ్చు. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని కూడా అందించారు. ఇద్దరూ కూడా వారి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. హీరోయిన్ హృతికని కూడా చూపించారు. పాత్రకు తగ్గట్టుగా ఆమె కూడా బాగానే నటించింది. ప్రియ, పృథ్వీరాజ్, కొత్త నటీనటులు అందరూ బాగా నటించారు.

సాంకేతికత :

 ఇందులో పాటలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. నిర్మాణ పనులు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. నిడివి తక్కువే అయినప్పటికీ ప్రేక్షకులు సినిమాను చూసినంత సేపు ఎంటర్టైన్ ను పొందవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ టైమింగ్స్
నటీనటుల నటన
ఇంటర్వెల్ ఎపిసోడ్స్
సాంగ్స్

మైనస్ పాయింట్స్ :

 మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు
 ఫ్రీ క్లైమాక్స్ సీన్స్

రేటింగ్ : 3



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>