EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganea0788b7-5205-4092-8163-354cd04f3190-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganea0788b7-5205-4092-8163-354cd04f3190-415x250-IndiaHerald.jpgసామాన్యుడిని గందరగోళంలోకి నెట్టి టీడీపీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే లక్ష్యంతో ఓ ప్రముఖ పత్రిక తన కథనాలను ప్రచురిస్తూనే ఉంది. నిప్పుల్లా నిత్యావసరాలు అనే ప్రత్యేక కథనం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలో ఉన్నపుడు ధరలు అదుపులో ఉండేవని ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొంది. ధరల పెరుగుదల గురించి వార్తలు రాయడం తప్పు బట్టడానికి లేదు. బియ్యం, కందిప్పు రేట్లు అమాంతం పెరిగిపోయాయని కందిపప్పు ధర దాదాపు 1JAGAN{#}GEUM;Kathanam;Andhra Pradesh;Success;News;Government;CBN;TDP;Jaganజగన్‌ గెలిస్తే ఖర్చు.. బాబు గెలిస్తే చౌక?జగన్‌ గెలిస్తే ఖర్చు.. బాబు గెలిస్తే చౌక?JAGAN{#}GEUM;Kathanam;Andhra Pradesh;Success;News;Government;CBN;TDP;JaganThu, 23 Nov 2023 07:00:00 GMTసామాన్యుడిని గందరగోళంలోకి నెట్టి టీడీపీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే లక్ష్యంతో ఓ ప్రముఖ పత్రిక తన కథనాలను ప్రచురిస్తూనే ఉంది. నిప్పుల్లా నిత్యావసరాలు అనే ప్రత్యేక కథనం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.  చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలో ఉన్నపుడు ధరలు అదుపులో ఉండేవని ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొంది.


ధరల పెరుగుదల గురించి వార్తలు రాయడం తప్పు బట్టడానికి లేదు. బియ్యం, కందిప్పు రేట్లు అమాంతం పెరిగిపోయాయని కందిపప్పు ధర దాదాపు 150 పైనే పలుకుతుందని టీడీపీ హయాంలో రూ. 70 కే వచ్చిందని రాసుకొస్తున్నారు. ఉప్పు, పప్పు, కూరగాయల రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటి ధరలు పెరిగిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా గత ప్రభుత్వాల హయాంలో ఉన్న రేట్లను కంపరిజన్ చేస్తూ వార్తలు రాయరు. కేవలం జగన్ సర్కారు నిత్యావసర ధరల్ని అదుపు చేయడంలో విఫలం అవుతున్నారని చెప్పడంలో సక్సెస్ అవుతున్నారు.


సాధారణంగా ఒక నిత్యావసర వస్తువు ధర భారీగా పెరిగినపుడు దాన్ని సూపర్ బజార్లలో, రైతు బజార్లతో పెట్టించి ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చేలా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఉల్లి పాయలు, కందిపప్పు, టామాట విషయంలో ఇలా చేస్తుండే వారు. గతంలో చంద్రబాబు ఇలా చేశారు. ఇప్పుడు జగన్ చేస్తున్నారు.


అయితే మైండ్ గేమ్ నడపడంలో టీడీపీ ఎల్లో మీడియాను సంపూర్ణంగా వాడుకుంటుంది. ఎందుకంటే టీడీపీ హయాంలో పెరిగిన ధరలను చూపించకుండా కేవలం అప్పుడు తక్కువున్న రేట్లను చూపిస్తూ ఇప్పుడున్న రేట్లు విపరీతంగా పెరిగాయని చెబుతూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారు. కానీ దీని విషయంలో మాత్రం ఎక్కడా కూడా ప్రజలు గుడ్డిగా నమ్మే కాలం పోయింది. ఆలోచించి ఎక్కడా లోపం ఉంది. ఏం జరుగుతుందనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతనే ఏ పార్టీని గెలిపించాలో వారికే ఓటు వేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>