Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shami75d3beaa-2127-441a-8de8-14c3c9e575bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shami75d3beaa-2127-441a-8de8-14c3c9e575bb-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో మారుమోగిపోతున్న బౌలర్ పేరు ఏది అంటే అందరూ మహమ్మద్ షమీ అని చెబుతారు. ఎందుకంటే వరల్డ్ కప్ లో లక్కీగా ఛాన్స్ దక్కించుకున్న మహమ్మద్ షమీ.. ఏకంగా టీమ్ ఇండియాకు లక్కీ ప్లేయర్గా మారిపోయాడు. ఎందుకంటే వరల్డ్ కప్ కోసం ఎంపికైనప్పటికి ప్రారంభ మ్యాచ్లలో అతను కేవలం బెంచ్ కి పరిమితం అయ్యాడు. హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఉండడంతో.. మహమ్మద్ షమిని తుద జట్టులోకి తీసుకోలేదు. కానీ హార్దిక్ గాయపడిన తర్వాత షమీ జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే అతను భారత జట్టులో లక్కShami{#}Hardik Pandya;Wife;Ishtam;Mohammed Shami;World Cupనువ్వంటే నాకు చాలా ఇష్టం.. మహమ్మద్ షమీ ఎమోషనల్ పోస్ట్?నువ్వంటే నాకు చాలా ఇష్టం.. మహమ్మద్ షమీ ఎమోషనల్ పోస్ట్?Shami{#}Hardik Pandya;Wife;Ishtam;Mohammed Shami;World CupThu, 23 Nov 2023 08:50:00 GMTగత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో మారుమోగిపోతున్న బౌలర్ పేరు ఏది అంటే అందరూ మహమ్మద్ షమీ అని చెబుతారు. ఎందుకంటే వరల్డ్ కప్ లో లక్కీగా ఛాన్స్ దక్కించుకున్న మహమ్మద్ షమీ.. ఏకంగా టీమ్ ఇండియాకు లక్కీ ప్లేయర్గా మారిపోయాడు. ఎందుకంటే వరల్డ్ కప్ కోసం ఎంపికైనప్పటికి ప్రారంభ మ్యాచ్లలో అతను కేవలం బెంచ్ కి పరిమితం అయ్యాడు. హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఉండడంతో.. మహమ్మద్ షమిని తుద జట్టులోకి తీసుకోలేదు. కానీ హార్దిక్ గాయపడిన తర్వాత షమీ జట్టులోకి వచ్చాడు.


 ఈ క్రమంలోనే అతను భారత జట్టులో లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు అంటూ ఎంతో మంది కామెంట్ చేశారు. కానీ ఇక వరల్డ్ కప్ లో అతని ప్రదర్శన చూసిన తర్వాత అతను లక్కీ ఛాన్స్ దక్కించుకోవడం కాదు. అతను జట్టులోకి రావడం టీమిండియా కు అదృష్టంగా మారిపోయింది అంటూ అభిప్రాయపడ్డారు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్నాడు. కేవలం 7 ఇన్నింగ్స్ లోనే టికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన వీరుడిగా నిలిచాడు.


 మహమ్మద్ షమీ ఇంతలా అత్యుత్తమ ప్రదర్శన చేసిన.. ఇక పైనల్ లో టీమిండియా ఓడిపోయింది. దీంతో టైటిల్ చేజారింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో షమీ పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. తన తల్లితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ.. అతి త్వరలో పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. దీంతో షమి తల్లీ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతుందని ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా షమీ తండ్రి చనిపోవడం.. ఇక భార్య విడాకులు తీసుకుని వదిలేయడంతో ఇక తల్లితోనే ఉంటున్నాడు షమి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>