MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir483f8eaa-cdea-4b87-aac3-29e9716db9ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir483f8eaa-cdea-4b87-aac3-29e9716db9ce-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇకపోతే భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ తో సందీప్ కి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఇక ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్ బranbir{#}shalini pandey;Kabir singh;Devarakonda;Darsakudu;Director;sandeep;Arjun Reddy;Kannada;Heroine;Reddy;Tamil;Remake;Hindi;December;Telugu;Cinema;rashmika mandanna;Indiaఅఫిషియల్ : యానిమాల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!అఫిషియల్ : యానిమాల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!ranbir{#}shalini pandey;Kabir singh;Devarakonda;Darsakudu;Director;sandeep;Arjun Reddy;Kannada;Heroine;Reddy;Tamil;Remake;Hindi;December;Telugu;Cinema;rashmika mandanna;IndiaThu, 23 Nov 2023 09:18:00 GMTవిజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇకపోతే భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ తో సందీప్ కి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఇక ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ దర్శకుడికి హిందీ సినీ పరిశ్రమలో కూడా సూపర్ క్రేజ్ లభించింది. 

ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు రన్బిర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>