Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc8c7b8228-2b7f-4da4-911f-3df2c2816f05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc8c7b8228-2b7f-4da4-911f-3df2c2816f05-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. కానీ ఇక ఈ ప్రపంచకప్ టోర్నీలో ఆటగాళ్లు చేసిన ప్రదర్శన గురించిన చర్చ మాత్రం ఇంకా ముగియటం లేదు. ఎంతో మంది ప్లేయర్లు చేసిన అత్యుత్తమ ప్రదర్శన గురించి చర్చించుకుంటూనే ఉన్నారు విశ్లేషకులు. అయితే మునుపెన్నడు లేని విధంగా భారత్ వేదికగా ప్రపంచ కప్ టోర్నీలో ప్రతి మ్యాచ్ లో కూడా పరుగుల ప్రవాహం కొనసాగింది అన్న విషయం తెలిసిందే. ఆటగాళ్లందరూ కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయం కోసం వీరోచితమైన పోరాటం చేశారు. ఈ క్రమంలోనే కేవలం ఆటగాళ్లIcc{#}Ravindra Jadeja;Shreyas Iyer;Delhi;K L Rahul;Cricket;Rohit Sharma;Yevaru;World Cup;India2023 వరల్డ్ కప్ లో.. భారీ సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్స్ వీరే?2023 వరల్డ్ కప్ లో.. భారీ సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్స్ వీరే?Icc{#}Ravindra Jadeja;Shreyas Iyer;Delhi;K L Rahul;Cricket;Rohit Sharma;Yevaru;World Cup;IndiaThu, 23 Nov 2023 13:15:00 GMTఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. కానీ ఇక ఈ ప్రపంచకప్ టోర్నీలో ఆటగాళ్లు చేసిన ప్రదర్శన గురించిన చర్చ మాత్రం ఇంకా ముగియటం లేదు. ఎంతో మంది ప్లేయర్లు చేసిన అత్యుత్తమ ప్రదర్శన గురించి చర్చించుకుంటూనే ఉన్నారు విశ్లేషకులు. అయితే మునుపెన్నడు లేని విధంగా భారత్ వేదికగా ప్రపంచ కప్ టోర్నీలో ప్రతి మ్యాచ్ లో కూడా పరుగుల ప్రవాహం కొనసాగింది అన్న విషయం తెలిసిందే. ఆటగాళ్లందరూ కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయం కోసం వీరోచితమైన పోరాటం చేశారు. ఈ క్రమంలోనే కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు వరల్డ్ కప్ టోర్నీ కూడా చాలా విషయాల్లో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.


 48 ఏళ్ళ ఎనిమిదేళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో ఇక అత్యధిక సిక్సర్లు నమోదైన వరల్డ్ కప్ ఎడిషన్ గా కూడా 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ గెలిచింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఈ ప్రపంచ కప్ టోర్నీలో 644 సిక్సర్లు నమోదు అయ్యాయి. దీంతో అరుదైన రికార్డు సృష్టించింది. అయితే ఈ ప్రపంచ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 31 సిక్సర్లతో టాప్ లో నిలిచాడు. అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా 99 సిక్సర్లతో సౌత్ఆఫ్రికా నిలిచింది. అయితే ఈ వరల్డ్ కప్ లో అత్యంత భారీ సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


ఆ వివరాలు చూసుకుంటే..

నెం.1 డారిల్ మిచెల్ (న్యూజిలాండ్): 2023 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో అతి భారీ సిక్సర్‌ను మిచెల్ బాదాడు. భారత్‌తో జరిగిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 107 మీటర్ల సిక్సర్ కొట్టాడు.

నెం.2 శ్రేయాస్ అయ్యర్:  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.

నెం.3 మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా): న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ 104 మీటర్ల దూరానికి భారీ సిక్సర్ బాదాడు.

నెం.4 కేఎల్ రాహుల్:  న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 104 మీటర్ల సిక్సర్ కొట్టాడు.

నెం.5 శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 101 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఇలా ఈ ఐదుగురు కూడా వరల్డ్ కప్ లో భారీ సిక్సర్లు కొట్టిన టాప్ 5 ప్లేయర్లుగా ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>