MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiger-3-in-huge-losses-another-disaster-for-bhaie0b7a656-2951-4e62-8630-e01a8e80834e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiger-3-in-huge-losses-another-disaster-for-bhaie0b7a656-2951-4e62-8630-e01a8e80834e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిన టైగర్ 3 మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. ఏక్ తా టైగర్ సిరీస్ లో పార్ట్ 3 గా ఈ మూవీ తెరకెక్కింది.యష్ రాజ్ స్పై థ్రిల్లర్ సిరీస్ లలో ఈ సినిమా కూడా ఒకటి. హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. ఈ ఏడాదిలో షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ మూవీలకి 1000 కోట్ల పైగా వసూళ్లు వచ్చాయి.అదే యష్ రాజ్ నుంచి వచ్చిన టైగర్ 3 మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ కి సగం కూడా రీచ్ కాలేదు.ఆ సTiger 3 - Salman Khan{#}Ayan Mukerji;Yash;Jaan;John;raj;war;Thriller;Kathanam;Salman Khan;Shahrukh Khan;Jawaan;Heroine;BEAUTY;Hero;Cinemaటైగర్ 3: భారీ నష్టాలు.. భాయ్ కి మరో డిజాస్టర్?టైగర్ 3: భారీ నష్టాలు.. భాయ్ కి మరో డిజాస్టర్?Tiger 3 - Salman Khan{#}Ayan Mukerji;Yash;Jaan;John;raj;war;Thriller;Kathanam;Salman Khan;Shahrukh Khan;Jawaan;Heroine;BEAUTY;Hero;CinemaThu, 23 Nov 2023 15:12:00 GMTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిన టైగర్ 3 మూవీ  థియేటర్స్ లోకి వచ్చింది. ఏక్ తా టైగర్ సిరీస్ లో పార్ట్ 3 గా ఈ మూవీ తెరకెక్కింది.యష్ రాజ్ స్పై థ్రిల్లర్ సిరీస్ లలో ఈ సినిమా కూడా ఒకటి. హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. ఈ ఏడాదిలో షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ మూవీలకి 1000 కోట్ల పైగా వసూళ్లు వచ్చాయి.అదే యష్ రాజ్ నుంచి వచ్చిన టైగర్ 3 మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ కి సగం కూడా రీచ్ కాలేదు.ఆ సినిమాల్లో 50% కూడా వసూలు చేయలేకపోయింది.ఫస్ట్ వీకెండ్ కొంత వరకు మంచి కలెక్షన్స్ వచ్చిన తరువాత క్రమంగా తగ్గిపోయాయి.ఇప్పటి దాకా టైగర్ 3 మూవీ దేశ వ్యాప్తంగా కేవలం 288 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. సల్మాన్ ఖాన్ ఇమేజ్ తో చూసుకుంటే ఈ కలెక్షన్స్ నిజంగా చాలా తక్కువ అని చెప్పాలి. హిందీతో పాటు ఇతర భాషలలో కూడా టైగర్ 3 మూవీ విడుదల అయ్యింది.ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని పవర్ ఫుల్ గా డిజైన్ చేసి ఆకట్టుకున్నారు.


కానీ కథనం మాత్రం అసలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో వారం రోజులకే ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ దెబ్బకు ఖాళీ అయిపోయాయి. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఖచ్చితంగా మరో 101 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. ఈ పరిస్థితిలో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టంగా మారింది.ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్ కిసికి భాయ్ కిసికా జాన్ సినిమా లాగే టైగర్ 3తో కూడా మరో డిజాస్టర్ అతని లిస్టులో చేరే ఛాన్స్ ఉంది. ఒక వేళ టైగర్ 3 డిజాస్టర్ అయితే మాత్రం ఈ సీక్వెల్స్ కి యష్ రాజ్ ఇక ఎండ్ కార్డ్ వేసేసే అవకాశం ఉండొచ్చు. అయితే ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ టైగర్ వెర్సస్ పఠాన్ అనే టైటిల్ తో మూవీ ప్లానింగ్ కి కూడా రెడీ అయ్యింది.ఇక టైగర్ సిరీస్ నుంచి సల్మాన్ పాత్రని పఠాన్ మూవీ నుంచి షారుఖ్ రోల్ తీసుకొని డిఫరెంట్ కంటెంట్ తో ఆ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం యాష్ రాజ్ లో అయాన్ ముఖర్జీ చేస్తోన్న వార్ 2 తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>