EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagana5008010-a601-49a5-a68c-cde07c5e023b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagana5008010-a601-49a5-a68c-cde07c5e023b-415x250-IndiaHerald.jpgఅధికారంలో ఉన్న వారు తమ పార్టీ కార్యకర్తలకు లాభం చేకూరాలని భావిస్తుంటారు. అందులో భాగంగానే టీడీపీ జన్మభూమి కమిటీలు వేసి .. ఆ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చి వారికి లబ్ధి చేకూర్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీర్లను నియమించి వారికి ఉపాధి కల్పించింది. ఇందులో ఎక్కువగా వైసీపీ కార్యకర్తలకే అవకాశం ఇచ్చారని మంత్రులతో పాటు విజయసాయిరెడ్డి కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం మారగానే వీళ్లు ఉంటారో ఉండరో చెప్పలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుతJAGAN{#}mithra;Application;Manam;Government;YCP;TDP;CM;Partyవాళ్ల ఉపాధి పోగొట్టిన జగన్‌..?వాళ్ల ఉపాధి పోగొట్టిన జగన్‌..?JAGAN{#}mithra;Application;Manam;Government;YCP;TDP;CM;PartyThu, 23 Nov 2023 00:00:00 GMTఅధికారంలో ఉన్న వారు తమ పార్టీ కార్యకర్తలకు లాభం చేకూరాలని భావిస్తుంటారు. అందులో భాగంగానే టీడీపీ జన్మభూమి కమిటీలు వేసి .. ఆ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చి వారికి లబ్ధి చేకూర్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీర్లను నియమించి వారికి ఉపాధి కల్పించింది. ఇందులో ఎక్కువగా వైసీపీ కార్యకర్తలకే అవకాశం ఇచ్చారని మంత్రులతో పాటు విజయసాయిరెడ్డి కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.


ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం మారగానే వీళ్లు ఉంటారో ఉండరో చెప్పలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం టీడీపీ హయాంలో చేపట్టిన పలు నియామకాలను తొలగించింది. దీనిపై టీడీపీ పలు విమర్శలు గుప్పిస్తోంది. సభ ఏదైనా  సీఎం జగన్ నా అక్క చెల్లెమ్మలు అంటూ మహిళలపై అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చామని పదే పదే చెబుతుంటారు. కానీ మహిళలకు ఉపయోగపడే కల్యాణ మిత్ర, బీమా మిత్ర, పశు మిత్ర వంటి పథకాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించారు.


వారికి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వచ్చే ఆదాయాన్ని దూరం చేశారు. మహిళల పొట్టకొట్టే సాధికారతను దూరం చేశారు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలా సుమారు 7500మంది మహిళలను నిర్దాక్షణ్యంగా విధుల నుంచి తప్పించారు. దీనిపై వైసీపీ వాదన మరోలా ఉంది. కల్యాణ మిత్ర పథకం కింద నియమించిన వారి విధులు ఏంటంటే టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన కల్యాణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆ డబ్బులు ఇచ్చిరావడానికి ఒకర్ని నియమించారు.


మనం ఎంత అంచనా వేసుకున్నా ఒక ప్రాంతంలో 10 పెళ్లిళ్లకు మించి జరగవు. అలాగే బీమా మిత్ర, పశు మిత్రలకు కూడా చాలా పరిమితమైన పనులు ఉంటాయి. వీటికి ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ వాటిని తొలగించింది. ఒకవేళ వీరిని తొలగించి వైసీపీ వాళ్లన పెట్టుకుంటే కోర్టులకు వెళ్తారనే ఉద్దేశంతో ఏకంగా విధుల నుంచి తప్పించారు. అయితే దీనివల్ల వారు ఉపాధి పొందుతున్నారనేది వాస్తవం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>