DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan476c1bc9-6855-41c1-beeb-12f63b649725-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan476c1bc9-6855-41c1-beeb-12f63b649725-415x250-IndiaHerald.jpgఇప్పుడు అంటే పత్రికల ప్రభావం తగ్గి పోయింది కానీ.. సుమారు 15 ఏళ్ల క్రితం వాటి విశ్వసనీయతే వేరు. కొన్ని గ్రామాల్లో రచ్చబండ లేదా ఒక సెంటర్ లో కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఎవరైనా కానివ్వండి దినపత్రిక చదువుతుంటే గుంపులుగా నిల్చొని మరీ వార్తలను ఆసక్తిగా వినేవారు. వాటి గురించి వివరంగా అడిగి తెలుసుకునేవారు. అప్పట్లో మొదటి ప్రాధాన్యం ఓ పత్రికకు మాత్రమే ఉండేది. ఆ పత్రికలో లో వార్త వచ్చింది అంటే చాలు. జనాల్లో ఓ నమ్మకం. కానీ ప్రస్తుతం పత్రికలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. సాక్షి విషయానికొస్తే jagan{#}Amaravati;Sakshi;Jagan;Government;YCP;CBNఆ రెండు పత్రికలు.. జగన్‌పై దూకుడు పెంచేశాయా?ఆ రెండు పత్రికలు.. జగన్‌పై దూకుడు పెంచేశాయా?jagan{#}Amaravati;Sakshi;Jagan;Government;YCP;CBNThu, 23 Nov 2023 13:00:00 GMTఇప్పుడు అంటే పత్రికల ప్రభావం తగ్గి పోయింది కానీ.. సుమారు 15 ఏళ్ల క్రితం వాటి విశ్వసనీయతే వేరు. కొన్ని గ్రామాల్లో రచ్చబండ లేదా ఒక సెంటర్ లో కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఎవరైనా కానివ్వండి దినపత్రిక చదువుతుంటే గుంపులుగా నిల్చొని మరీ వార్తలను ఆసక్తిగా వినేవారు. వాటి గురించి వివరంగా అడిగి తెలుసుకునేవారు.


అప్పట్లో మొదటి  ప్రాధాన్యం ఓ పత్రికకు మాత్రమే ఉండేది. ఆ పత్రికలో లో వార్త వచ్చింది అంటే చాలు. జనాల్లో ఓ నమ్మకం. కానీ ప్రస్తుతం పత్రికలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. సాక్షి విషయానికొస్తే అది వైసీపీ పత్రిక అనవచ్చు. అలాగే ఇప్పుడు మరో రెండు పత్రికలు ఎల్లో మీడియాగా ముద్ర పడిపోయాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో బ్యాలెన్స్ డ్ గా వెళ్లిన ఆ పత్రిక ఇప్పుడు పూర్తిగా వార్త రాసే విధానం మార్చేసింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వస్తోంది. ఇలా రాయడం తప్పేమీ కాకపోయినా..కొన్ని విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.


తాజాగా ప్రభుత్వం దగ్గర నుంచి బడా గుత్తేదారులకే చెల్లింపులు జరుగుతున్నాయి.  చిన్న, సామాన్య గుత్తేదారులకు అష్టకష్టాలు పడుతున్నారు. సుమారు రూ.1.8లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 43 మంది చిన్న కాంట్రాక్టర్లు చనిపోయారు అని ఓ వార్తా పత్రిక రాసుకొచ్చింది.  వాస్తవానికి చంద్రబాబు అయినా.. వైఎస్ జగన్ అయినా వాళ్లకి కావాల్సిన వాళ్లకే బిల్లులు చెల్లిస్తున్నారు. గతంలో పట్టుసీమ ప్రాజెక్టు అప్పుడు మేఘా సంస్థలకు పెండింగ్ లేకుండా చంద్రబాబు చెల్లింపులు జరిపారు. ఇప్పుడు జగన్  కూడా మేఘా సంస్థకు అలానే జరుపుతున్నారు.


గతంలో అమరావతి బిల్లులును చంద్రబాబు పెండింగ్ ఉంచారు. వాటిని వైసీపీ ప్రభుత్వం కట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించారు. ఇద్దరు రాజకీయ నేతలు చేసేది తప్పే అయినా ఒకరిని మాత్రమే చూపిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. గతంలోలాగా ప్రజలు కూడా వార్తాపత్రికలు రాసేది నిజమని నమ్మడం లేదు. ఈ విషయాన్ని అన్ని పత్రికలు గమనించాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>