MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/who-would-play-raviteja-in-his-biopic-the-actor-reacts7d61d853-2dfe-4b9c-951d-1e0558f21f6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/who-would-play-raviteja-in-his-biopic-the-actor-reacts7d61d853-2dfe-4b9c-951d-1e0558f21f6e-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుసగా కొత్త హీరోయిన్ లతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం రవితేజ "డిస్కో రాజా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నబా నటేష్ ... రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కంటే ముందు ఈ బ్యూటీ కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించింది. ఇకపోతే ఆ తర్వాత రవితేజ "ధమాకా" సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కంటే ముందు శ్రీ లీల కూడా కేవలం పెళ్లి సందD అనే తెలుగు మూవీ లో మాత్రమraviteja{#}gayatri;Akkineni Nageswara Rao;Girl;Ravi;ravi teja;marriage;media;BEAUTY;sree;Heroine;Telugu;Cinemaరవితేజ నెక్స్ట్ మూవీ లో మరో కొత్త హీరోయిన్..?రవితేజ నెక్స్ట్ మూవీ లో మరో కొత్త హీరోయిన్..?raviteja{#}gayatri;Akkineni Nageswara Rao;Girl;Ravi;ravi teja;marriage;media;BEAUTY;sree;Heroine;Telugu;CinemaThu, 23 Nov 2023 13:14:00 GMTమాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుసగా కొత్త హీరోయిన్ లతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం రవితేజ "డిస్కో రాజా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నబా నటేష్ ... రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కంటే ముందు ఈ బ్యూటీ కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించింది. ఇకపోతే ఆ తర్వాత రవితేజ "ధమాకా" సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కంటే ముందు శ్రీ లీల కూడా కేవలం పెళ్లి సందD అనే తెలుగు మూవీ లో మాత్రమే నటించింది.

ఇకపోతే రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన నుపుర్ సనన్ , గాయత్రీ భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాతోనే ఈ ఇద్దరు నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా వరుసగా కొత్త హీరోయిన్ లతో సినిమాలు చేస్తూ వస్తున్న రవితేజ మరోసారి మరో కొత్త హీరోయిన్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... రవితేజ మరికొన్ని రోజుల్లోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో హీరోయిన్ కోసం ఇప్పటికే ఈ చిత్ర బృందం వెతుకులాటలో పడినట్లు అందులో భాగంగా కొత్త అమ్మాయి కి ఫోటో షూట్ జరిపినట్లు అన్ని ఓకే అయితే ఈ ముద్దుగుమ్మనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓకే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ధమాకా మూవీ లో హీరోగా నటించాడు. అలాగే ప్రస్తుతం ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇది వీరి కాంబినేషన్ లో మూడవ సినిమా.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>