Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl124f22cf-4e66-464a-87aa-960b2925440b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl124f22cf-4e66-464a-87aa-960b2925440b-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే ఎందుకంటే ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఏకంగా వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా పేరుగాంచింది. భారత క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ లో భాగం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఇక ఎంతోమంది యంగ్ క్రికెటర్లకు కూడా తమ ప్రతిభ ఏంటో నిరూపించుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు ఐపీఎల్ అనేది ఒక మంచి వేదికగాIpl{#}Mini;Dubai;Cricket;BCCI;World Cup;INTERNATIONAL;December;Indian;India;Yuvaఐపీఎల్ వేలంలో.. ఎంతమంది ఆటగాళ్లు ఉన్నారో తెలుసా?ఐపీఎల్ వేలంలో.. ఎంతమంది ఆటగాళ్లు ఉన్నారో తెలుసా?Ipl{#}Mini;Dubai;Cricket;BCCI;World Cup;INTERNATIONAL;December;Indian;India;YuvaThu, 23 Nov 2023 16:25:00 GMTబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే  ఎందుకంటే ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఏకంగా వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా పేరుగాంచింది. భారత క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ లో భాగం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు.


 ఇక ఎంతోమంది యంగ్ క్రికెటర్లకు కూడా తమ ప్రతిభ ఏంటో నిరూపించుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు ఐపీఎల్ అనేది ఒక మంచి వేదికగా మారిపోయింది. ఇక ఇలా ఎంతోమంది ప్రతిభగల యువ ఆటగాళ్లు కోట్ల రూపాయల ధర పలుకుతూ ఉండడంతో ఐపీఎల్ వల్ల ఇక ఎంతోమంది ఆటగాళ్ల ఆర్థిక కష్టాలు కూడా దూరం అవుతున్నాయి. అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కోసం అని ఏర్పాట్లు చేస్తుంది బీసీసీఐ. డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం నిర్వహించబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ మినీ వేలం ప్రక్రియను భారత్ వేదికగానే నిర్వహిస్తారు అని అనుకున్నప్పటికీ ఇక ఈ వేదికను దుబాయ్ కి మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా జట్టు నుంచి వదిలేసుకోవాలి అన్న ఆటగాళ్ల వివరాలను కూడా ప్రకటించాయి. అదే సమయంలో ఇక మొన్నటి వరకు వరల్డ్ కప్ లో సత్తా చాటిన ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కూడా అటు ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎంతమంది ఐపీఎల్ మినీ ఆక్షన్ లో పాల్గొనబోతున్నారు అన్న విషయాన్ని ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఏకంగా 590 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఇందులో పాల్గొనబోతున్నారు. ఈ వేలంలో వరల్డ్ కప్ హీరోలకు భారీ ధర పలికే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>