Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc558a7849-7fcd-438d-ba84-75fd46e5ff55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc558a7849-7fcd-438d-ba84-75fd46e5ff55-415x250-IndiaHerald.jpgదాదాపు నెలన్నర రోజులపాటు క్రికెట్ ప్రేక్షకులను అలరించిన వరల్డ్ కప్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లకు ఒక్కసారి జరిగే ఈ మెగా టోర్నీలో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది. ఆసాంతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రేక్షకులందరికీ అస్సలు సిసలైన ఎంటర్టైర్మెంట్ అందించింది అని చెప్పాలి. ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా చివరికి సొంత గడ్డమీద కూడా భారత జట్టుకు వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అన్న కల నెరవేరలేదు. కాగా వరల్డ్ కప్Icc{#}Ravindra Jadeja;Mohammed Shami;Australia;World Cup;Cricketఈ స్టార్ ప్లేయర్స్ అందరూ.. చివరి వరల్డ్ కప్ ఆడేసారా?ఈ స్టార్ ప్లేయర్స్ అందరూ.. చివరి వరల్డ్ కప్ ఆడేసారా?Icc{#}Ravindra Jadeja;Mohammed Shami;Australia;World Cup;CricketWed, 22 Nov 2023 16:37:00 GMTదాదాపు నెలన్నర రోజులపాటు క్రికెట్ ప్రేక్షకులను అలరించిన వరల్డ్ కప్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లకు ఒక్కసారి జరిగే ఈ మెగా టోర్నీలో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది. ఆసాంతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రేక్షకులందరికీ అస్సలు సిసలైన ఎంటర్టైర్మెంట్ అందించింది అని చెప్పాలి. ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా చివరికి సొంత గడ్డమీద కూడా భారత జట్టుకు వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అన్న కల నెరవేరలేదు.


కాగా వరల్డ్ కప్ ముగిసింది. మరో నాలుగు ఏళ్ల తర్వాత ఈ ప్రపంచకప్ టోర్నీ జరగబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్ లో ఆడిన ఎంతో మంది స్టార్ ప్లేయర్లు వచ్చే వరల్డ్ కప్ నాటికి రిటైర్మెంట్ ప్రకటించి మాజీ ప్లేయర్లుగా మారె అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో ఎంతో మంది స్టార్ ప్లేయర్ తమ చివరి వరల్డ్ కప్ ఆడేశారు అంటూ ఇక కొన్ని పేర్లు తెరమీదకి వస్తున్నాయి. 36 ఏళ్ల రోహిత్ ఇప్పటికి ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. 2027 నాటికి అతను రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండడం అసాధ్యమని చెప్పాలి. 33 ఏళ్ల మహమ్మద్ షమీ సైతం వచ్చే ప్రపంచ కప్ నాటికి  రిటైర్మెంట్ ఆలోచన చేసే అవకాశం ఉంది. 37 ఏళ్ల అశ్విన్, 34 ఏళ్ల జడేజా జట్టులో ఉండటం కష్టమే.


 35 ఏళ్ల కోహ్లీకీ ఇక 2027 వరల్డ్ కప్ నాటికి 39 ఏళ్ళు వస్తాయి. అతని ఫిట్నెస్ దృశ్య జట్టులో కొనసాగే అవకాశాలు లేకపోలేదు అని చెప్పాలి. వీళ్ళు మాత్రమే కాకుండా ఈ ప్రపంచకప్‌ కోసమే రిటైర్మెంట్‌ నుంచి బయటకు వచ్చిన బెన్‌ స్టోక్స్‌, ఊహించని విధంగా ఛాన్స్ తగ్గించుకున్న  ఏంజెలో మాథ్యూస్‌ కూడా వచ్చే ప్రపంచకప్‌ ఆడకపోవచ్చు అని తెలుస్తుంది. ఇక 38 ఏళ్ల మహమ్మద్‌ నబి (అఫ్గానిస్థాన్‌), 37 ఏళ్ల వార్నర్‌, 34 ఏళ్ల స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, 33 ఏళ్ల స్టార్క్‌ (ఆస్ట్రేలియా), 33 ఏళ్ల కేన్‌ విలియమ్సన్‌, 34 ఏళ్ల బౌల్ట్‌, సౌథీ (న్యూజిలాండ్‌), 36 ఏళ్ల షకిబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీం (బంగ్లాదేశ్‌), డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లాండ్‌), బవుమా, మిల్లర్‌, వాండర్‌ డసన్‌ (దక్షిణాఫ్రికా) లాంటి ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్ కప్ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డికాక్‌ (దక్షిణాఫ్రికా), డేవిడ్‌ విల్లీ (ఇంగ్లాండ్‌) లాంటి పేయర్లు.. వరల్డ్ కప్ ముగియగానే ఇప్పటికే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>