MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgయంగ్ హీరో విశ్వక్సేన్ మీడియాతో ఎలా మాట్లాడినా అది సంచలనమే ఇతడు హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదారి’ డిసెంబర్ 8న విడుదల చేయాలని చాల ముందుగానే నిర్మాతలు ఆ డేట్ కు తమ సినిమా రిలీజ్ అయ్యేలా పక్కా ప్లాన్ వేశారు. అయితే ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ ఖరార్ కావడంతో డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేసుకున్న అనేక సినిమాలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. ఈవిషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా విశ్వక్సేన్ తన సినిమాను రోజులు గడుస్తున్న కొద్ది ప్రమోషన్ విషయంలో చాల లో ప్రొఫైల్ కొనసాగిస్తున్నాడు. అయితే ఆమధvishek sen{#}Viswak sen;sithara;Nani;varun tej;Prabhas;News;Hero;Cinema;Decemberవిశ్వక్సేన్ మౌనం వెనుక ఆంతర్యం !విశ్వక్సేన్ మౌనం వెనుక ఆంతర్యం !vishek sen{#}Viswak sen;sithara;Nani;varun tej;Prabhas;News;Hero;Cinema;DecemberWed, 22 Nov 2023 14:21:19 GMT

యంగ్ హీరో విశ్వక్సేన్ మీడియాతో ఎలా మాట్లాడినా అది సంచలనమే ఇతడు హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదారి’ డిసెంబర్ 8న విడుదల చేయాలని చాల ముందుగానే నిర్మాతలు ఆ డేట్ కు తమ సినిమా రిలీజ్ అయ్యేలా పక్కా ప్లాన్ వేశారు. అయితే ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ ఖరార్ కావడంతో డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేసుకున్న అనేక సినిమాలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. 


ఈవిషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా విశ్వక్సేన్ తన సినిమాను రోజులు గడుస్తున్న కొద్ది ప్రమోషన్ విషయంలో చాల లో ప్రొఫైల్ కొనసాగిస్తున్నాడు. అయితే ఆమధ్య జరిగిన ఒక ఫిలిమ్ ఫంక్షన్ లో ఈ యంగ్ హీరో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలోనూ తన మూవీ డిసంబర్ 8న విడుదలై తీరుతుందని అలా జరగకపోతే తాను ఆ మూవీ ప్రోమోషన్ లో పాల్గొనను అంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలియిందే. 


అయితే ఈ మూవీని నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ మూవీని వాయిదా వేస్తాము అని లీకులు ఇస్తున్న పరిస్థితులలో అప్పటివరకు ఆవేశంగా కామెంట్స్ చేసిన విశ్వక్సేన్ ఇప్పుడు తన సినిమా రిలీజ్ డేట్స్ కు సంబంధించి మౌనం వహించడం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. 


వాస్తవానికి ఇదే డేట్ కు రావలసి ఉన్న నితిన్ వక్కంతం వంశీల సినిమా కూడ వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి విశ్వక్సేన్ మూవీ పైనే ఉంది. ఇలా డిసెంబర్ 8న విడుదల కావలసి ఉన్న అన్ని సినిమాలు నాని ‘హాయ్ నాన్న’ మూవీ కోసం లైన్ క్లియర్ చేస్తున్నాయి అనుకోవాలి. జరుగుతున్న ఈ పరిణామాలు పట్ల అత్యంత ఆవేశంగా మాట్లాడే విశ్వక్సేన్ ఇప్పుడు మాట్లాడకపోవడం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ కూడ వాయిదా పడుతున్నట్లు వార్తలు రావడంతో విశ్వక్ సేన్ కు నాని కోసం త్యాగం చేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..   




ReplyForward




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>