PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpbd6bca5c-b4ee-4668-a579-82aa03dce763-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpbd6bca5c-b4ee-4668-a579-82aa03dce763-415x250-IndiaHerald.jpgతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతోంది. సర్వేలు బీఆర్ఎస్ కు కొన్ని, కాంగ్రెస్ కు కొన్ని మొగ్గు చూపుతుండగా.. మౌత్ టాక్ మాత్రం హస్తం పార్టీదే హవా అని వస్తోంది. ఇది కాంగ్రెస్ కు కొంత ఉత్సాహం తీసుకువస్తోంది. మరోవైపు బీజేపీ బీసీ సీఎం, మాదిగల వర్గీకరణ వంటి అంశాలతో తగ్గేదేలే అంటోంది. అయితే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంలా పనిచేసిన ఎమ్మార్పీఎస్ ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించింది. వాస్తవానికి ఎమ్మార్పీఎస్ కు గుర్తింపు తీసుకొచ్చి మందకృష్ణ మాదిగను పరBJP{#}Telugu Desam Party;Press;Hyderabad;war;MP;Congress;Assembly;Minister;Bharatiya Janata Party;Prime Ministerతెలంగాణ బీజేపీకి ఆ కులం దన్ను కలిసొస్తుందా?తెలంగాణ బీజేపీకి ఆ కులం దన్ను కలిసొస్తుందా?BJP{#}Telugu Desam Party;Press;Hyderabad;war;MP;Congress;Assembly;Minister;Bharatiya Janata Party;Prime MinisterWed, 22 Nov 2023 10:00:00 GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతోంది.  సర్వేలు బీఆర్ఎస్ కు కొన్ని, కాంగ్రెస్ కు కొన్ని మొగ్గు చూపుతుండగా.. మౌత్ టాక్ మాత్రం హస్తం పార్టీదే హవా అని వస్తోంది. ఇది కాంగ్రెస్ కు కొంత ఉత్సాహం తీసుకువస్తోంది. మరోవైపు బీజేపీ బీసీ సీఎం, మాదిగల వర్గీకరణ వంటి అంశాలతో తగ్గేదేలే అంటోంది.


అయితే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంలా పనిచేసిన ఎమ్మార్పీఎస్ ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించింది. వాస్తవానికి ఎమ్మార్పీఎస్ కు గుర్తింపు తీసుకొచ్చి మందకృష్ణ మాదిగను పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబే. కానీ ఆయనకు మాత్రం ఏ పదవి అప్పజెప్పలేదు. ఎమ్మార్పీఎస్ ను అడ్డు పెట్టుకొని మిగతా నాయకులు ఎమ్మెల్యే, మంత్రి పదవులు పొందారు కానీ మందకృష్ణ కు మాత్రం ఎప్పుడు నిరాశే ఎదురైంది.  మొదట నుంచి తనకు పదవులు ముఖ్యం కాదని.. వర్గీకరణే తన మొదటి ప్రాధాన్యం అంటూ మందకృష్ణ కూడా చెప్పుకుంటూ వచ్చారు.


ఇటీవల హైదరాబాద్ లో మాదిగల విశ్వరూప సభ పెడితే జనం భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మందకృష్ణను తన సోదరుడు అంటూనే ఆయన  చేసే పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణకు కమిటీ వేస్తామని హామీని సైతం ప్రకటించారు.


ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ బీజేపీకి అధికారిక మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 11శాతం ఉన్న మాదిగలు బీజేపీకి అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ ఓట్లన్నీ బీజేపీకి గంపగుత్తుగా పడతాయా లేదా చూడాలి.  అయితే కిందటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా, ఎంపీ ఎన్నికల్లో 22శాతం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 33శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు ఈ 11శాతం ఓట్లు కూడా పోగైతే ఆ పార్టీకి పెద్ద సానుకూలాంశమే అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>