Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiacea59cbe-d053-431c-a6c7-7e5c89b61937-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiacea59cbe-d053-431c-a6c7-7e5c89b61937-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భారత జట్టుకు తీవ్ర నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి కూడా వరుస విజయాలు సాధిస్తూ దూసుకు వచ్చిన టిమిడియా.. అటు కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడింది. అప్పటివరకు ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించిన టీమిండియా.. ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించడంలో మాత్రం విఫలమైంది. ఈ క్రమంలోనే ఇక ఈసారైనా వరల్డ్ కప్ గెలవాలనే కల అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో అటు భIndia{#}Pakistan;Cricket;India;World Cupఫైనల్లో భారత్ ఓడిపోయి.. మంచి పని అయింది : పాక్ మాజీఫైనల్లో భారత్ ఓడిపోయి.. మంచి పని అయింది : పాక్ మాజీIndia{#}Pakistan;Cricket;India;World CupWed, 22 Nov 2023 12:15:00 GMTఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భారత జట్టుకు తీవ్ర నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి కూడా వరుస విజయాలు సాధిస్తూ దూసుకు వచ్చిన టిమిడియా.. అటు కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడింది. అప్పటివరకు  ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని  చలాయించిన టీమిండియా.. ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించడంలో మాత్రం విఫలమైంది. ఈ క్రమంలోనే ఇక ఈసారైనా వరల్డ్ కప్ గెలవాలనే కల అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి.



 అయితే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో అటు భారత జట్టు వరుస విజయాలతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తే.. ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు మాత్రం దారుణంగా పరాజయాలను చవిచూసింది. దీంతో కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశ నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ఓడిపోయి భారత్ వరుస విజయాలు సాధిస్తూ ఉండడంతో.. ఆ దేశ మాజీ ఆటగాళ్లు అస్సలు చూసి ఓర్వలేకపోయారు. ఈ క్రమంలోనే ఇక భారత జట్టుపై  సంచలన ఆరోపణలు చేశారు.


 అయితే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో ఎంతోమంది పాకిస్తాన్ మాజీలు సంతోషంలో మునిగిపోయారు.  ఈ క్రమం లోనే భారత్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తీవ్ర విమర్శలు చేసి మరోసారి తన వక్ర బుద్ధుని చాటుకున్నాడు. క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది. ఒకవేళ భారత్ వరల్డ్ కప్ గెలిచి ఉంటే.. క్రికెట్ కు అది బాధాకరమైన క్షణం. ఎందుకంటే మ్యాచ్ కు ముందే వారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎందుకంటే ఐసీసీ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కి అలాంటి దారుణమైన పిచ్ ను ఉపయోగించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఫైనల్ లో టీమిండియా ఓడిపోవడం.. క్రికెట్ లో ఒక మంచి పరిణామం అంటూ అబ్దుల్ రజాక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>