EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/electionsa74b5a36-811d-4d0d-b8b3-8f7a70c4965c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/electionsa74b5a36-811d-4d0d-b8b3-8f7a70c4965c-415x250-IndiaHerald.jpgఎన్నికలు వచ్చాయంటే నాయకులు, కార్యకర్తల్లో జోష్ ఉండటం సహజమే.. మారతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు, అభ్యర్థులు ప్రచార తీరును మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఒకప్పటి ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా ఉంది. అదేంటంటే.. ఒకప్పుడు ఎన్నికలు అంటే ఉపాధి. ఇప్పుడు చాలా మందికి ఉపాధి లభిస్తున్నా దిగువ స్థాయి వారికి మేలు జరగడం లేదు. గతంలో ఎన్నికలు అంటే పోస్టర్లు అంటించే వారు, కర పత్రాలు పంచేవారు, నినాదాలు చేసేవారు, హోటళ్లు నడిపేవారు ఇలా పలు రకాల పనులను కొంతమంది మాత్రమే నిర్వహించేవారు. ఏదైనాELECTIONS{#}WhatsApp;Evening;Josh;Posters;local language;media;Elections;Partyతెలంగాణ ఎన్నికల్లో భలే మార్పులు.. గమనించారా?తెలంగాణ ఎన్నికల్లో భలే మార్పులు.. గమనించారా?ELECTIONS{#}WhatsApp;Evening;Josh;Posters;local language;media;Elections;PartyWed, 22 Nov 2023 07:00:00 GMTఎన్నికలు వచ్చాయంటే నాయకులు, కార్యకర్తల్లో జోష్ ఉండటం సహజమే.. మారతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు, అభ్యర్థులు ప్రచార తీరును మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.  అయితే ఒకప్పటి ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా ఉంది. అదేంటంటే.. ఒకప్పుడు ఎన్నికలు అంటే ఉపాధి. ఇప్పుడు చాలా మందికి ఉపాధి లభిస్తున్నా దిగువ స్థాయి వారికి మేలు జరగడం లేదు.


గతంలో ఎన్నికలు అంటే పోస్టర్లు అంటించే వారు,  కర పత్రాలు పంచేవారు, నినాదాలు చేసేవారు, హోటళ్లు నడిపేవారు ఇలా పలు రకాల పనులను కొంతమంది మాత్రమే నిర్వహించేవారు. ఏదైనా పార్టీ కార్యాలయం ప్రారంభించారంటే చాలు  ఆపరిసరాలంతా సందడి వాతావరణం నెలకొనేది. దీంతో అక్కడ స్థానికంగా ఉండే పలువురు దుకాణాదారులకు, పండ్లు అమ్ముకునే ముసలవ్వలకు, హోటళ్లకు మంచి గిరాకీ లభించేంది.


కానీ ఇప్పుడు నేరుగా పార్టీ నాయకులే ఓ ఇద్దరు వంట మనుషులను మాట్లాడుకొని వంట చేయిస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్లీ భోజనం ఇలా వాళ్లే తయారు చేసి పెడుతుండటంతో స్థానిక ప్రజలకు ఉపాధి కరవవుతోంది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దాదాపు మీడియాను కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


డిజిటల్ మీడియా ప్రభావంతో ఎవరికి వారే సొంతంగా వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీలు సృష్టించి ప్రచారాన్ని అరచేతిలో పెడుతున్నారు. సర్వేలు, ఇతర అంశాలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారికే డిమాండ్ బాగా పెరిగింది. ఫొటో స్టూడియో, ప్రచార గీతాలు ఆలపించేవారు. నృత్యం చేసేవారు, టెక్నాలజీపై పట్టున్న వారికే ఈ ఎన్నికల్లో అగ్రతాంబూలం దక్కుతుంది. కష్టించి పనిచేసే వారికి గతంలో లాగా ఉపాధి దొరకడం లేదు. మరోవైపు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కండావాలు, టోపీలు, పూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అలాగే బిర్యానీ సెంటర్లకు కూడా మంచి గిరాకీ లభిస్తోంది. మారుతున్న పరిస్థితులు బట్టే రాజకీయ నాయకులు మారుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>