BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kapubc32cb37-55de-44f3-acda-22ee77069783-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kapubc32cb37-55de-44f3-acda-22ee77069783-415x250-IndiaHerald.jpgఆంధ్ర, రాయలసీమ కాపులకు, తెలగ, బలిజ, ఒంటరి లాంటి అగ్రవర్ణ కులాలకు తెలంగాణలో మున్నూరుకాపు సంఘం సర్టిఫికెట్ ఇస్తామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తూ మున్నూరుకాపులకు ద్రోహాం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపులు ఉన్నది KAPU{#}srinivas;Rayalaseema;Janasena;Rajya Sabha;Congress;Bharatiya Janata Party;Backward Classes;Telanganaఆంధ్రా కాపులకు తెలంగాణలో మున్నూరు కాపు సర్టిఫికెట్లా?ఆంధ్రా కాపులకు తెలంగాణలో మున్నూరు కాపు సర్టిఫికెట్లా?KAPU{#}srinivas;Rayalaseema;Janasena;Rajya Sabha;Congress;Bharatiya Janata Party;Backward Classes;TelanganaTue, 21 Nov 2023 11:00:00 GMTఆంధ్ర, రాయలసీమ కాపులకు, తెలగ, బలిజ, ఒంటరి లాంటి అగ్రవర్ణ కులాలకు తెలంగాణలో మున్నూరుకాపు సంఘం సర్టిఫికెట్ ఇస్తామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర  ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తూ మున్నూరుకాపులకు ద్రోహాం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర  మున్నూరుకాపులు ఉన్నది ఒక్క తెలంగాణలో మాత్రమేనని, ఆంధ్రలో ఓసీలుగా ఉన్న కాపులను తెలంగాణలో మున్నూరుకాపులుగా చేర్చుకుని బీసీ సర్టిఫికెట్ ఇస్తే తెలంగాణలో ఉన్న మున్నూరుకాపులు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.


రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే మున్నూరుకాపు కుల ద్రోహిగా ప్రకటిస్తామని పిల్లి శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ 10 సీట్లు, బీజేపీ 6 సీట్లు, జనసేన 3 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లను మున్నూరు కాపులకు కేటాయించిందని పిల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. మున్నూరుకాపులను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని పిల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>