MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/tollywood5918f762-cf88-458f-8752-89c9ce2a9369-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/tollywood5918f762-cf88-458f-8752-89c9ce2a9369-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. అయితే ఇప్పుడు స్టార్ హీరోలతో పోటీకి సిద్ధమయ్యాడు. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు నాగార్జున రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. వాటికి పోటీగా హనుమాన్ సినిమా సైతం విడుదల చేస్తున్నారు. టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్టు పై ఇండస్ట్రీ తో పాటు ఆడియన్స్ లోనూ మంచి హైప్ tollywood{#}prasanth varma;Viswak sen;mahesh babu;ravi teja;Joseph Vijay;prasanth;Prashant Kishor;teja;Ravi;Audience;Industry;Success;Cinemaహనుమాన్ మూవీ పైనే ఆశలు పెట్టుకున్న తేజ సజ్జా..!?హనుమాన్ మూవీ పైనే ఆశలు పెట్టుకున్న తేజ సజ్జా..!?tollywood{#}prasanth varma;Viswak sen;mahesh babu;ravi teja;Joseph Vijay;prasanth;Prashant Kishor;teja;Ravi;Audience;Industry;Success;CinemaTue, 21 Nov 2023 17:35:00 GMTతేజ సజ్జ. అయితే ఇప్పుడు స్టార్ హీరోలతో పోటీకి సిద్ధమయ్యాడు. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు నాగార్జున రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. వాటికి పోటీగా హనుమాన్ సినిమా సైతం విడుదల చేస్తున్నారు.  టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్టు పై ఇండస్ట్రీ తో పాటు ఆడియన్స్ లోనూ మంచి హైప్ నెలకొంది. ఇక రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచాయి. 

ఇప్పటికే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో 'జాంబిరెడ్డి' మూవీ మంచి సక్సెస్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే తేజ సజ్జా ఈ మూవీ తోనే హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక తాజాగా నటిస్తున్న 'హనుమాన్' మూవీతో కచ్చితంగా తనకు స్టార్ ఇమేజ్ వస్తుందనే ధీమాతో ఉన్నాడట ఈ యంగ్ హీరో. అందుకే 'హనుమాన్' మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ తన టైం మొత్తం ఈ సినిమా కోసమే కేటాయిస్తున్నాడట. అందుకే కొత్త ప్రాజెక్టులు ఏమీ ఓకే చేయడం లేదని అంటున్నారు. ఈ మధ్య యంగ్ హీరోలు ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరికొన్ని ప్రాజెక్ట్స్ ని ఓకే చేసుకున్నారు.

 విజయ్ దేవరకొండ, నిఖిల్, విశ్వక్ సేన్ లతో పాటూ మరికొందరు హీరోలు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కానీ తేజ సజ్జ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. 'హనుమాన్' తో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకొని టైర్ 2 హీరోల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక హనుమాన్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా తేజా సజ్జ అనుకున్నది జరిగేలా కనిపిస్తోంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>