Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kadambari-kiran-manamsaitham-program5f15f644-a37e-4ad0-8f4c-73abf4ff675e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kadambari-kiran-manamsaitham-program5f15f644-a37e-4ad0-8f4c-73abf4ff675e-415x250-IndiaHerald.jpgసినీ నటుడు కాదంబరి కిరణ్ ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో పేద కార్మికులకు, వారి అవసరాలకు సహాయం చేస్తూ వస్తున్నారు. ‘మనం సైతం'(ంఅనం శైథం) అనే ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి సాయం చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత పదేళ్లుగా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్Kadambari Kiran{#}jayasudha;kadambari kiran;prasanna;SantDinesh Chandra Yadavosh Kumar;Kurnool;Dil;Kerala;KCR;Manam;prasad;Service;MP;KTR;srinivas;Telangana;Industry;Ministerకాదంబరి కిరణ్ మనంసైతం.. వాళ్లకు చెక్కుల పంపిణి..!కాదంబరి కిరణ్ మనంసైతం.. వాళ్లకు చెక్కుల పంపిణి..!Kadambari Kiran{#}jayasudha;kadambari kiran;prasanna;SantDinesh Chandra Yadavosh Kumar;Kurnool;Dil;Kerala;KCR;Manam;prasad;Service;MP;KTR;srinivas;Telangana;Industry;MinisterTue, 21 Nov 2023 14:10:10 GMTసినీ నటుడు కాదంబరి కిరణ్ ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో పేద కార్మికులకు, వారి అవసరాలకు సహాయం చేస్తూ వస్తున్నారు. ‘మనం సైతం'(ంఅనం శైథం) అనే ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి సాయం చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత పదేళ్లుగా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ద్వారా మరో ఆరుగురు పేదలకు నిర్మాతలు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు ఇచ్చారు.

మనం సైతం ఫౌండేషన్ మొదలైనప్పటి నుంచి తనకు అండగా ఉంటున్న కళామతల్లి ముద్దు బిడ్డలు అందరికి పాదాభివందనాలని అన్నారు. పదేళ్లలో పేదలైన సినీ కార్మికులకు కోటి రూపాయాలకు పైగా సహాయం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఙతలు తెలిపారు. ఈక్రమంలో  సాయం అడిగేవారికి తోచినంత సాయం చేస్తున్నాను.  

కేరళ వరదలు, తిత్లీ తూఫాన్, కర్నూలు వరదల సమయంలో అందరి సహాకారంతో సహాయం చేశాము. ఎంతోమందికి సాయం చేరుతున్నా దాతల దగ్గరికి ఇంకా వెళ్లట్లేదని అనిపించింది. ఇది తెలుసుకొని పలువురు ఇండస్ట్రీ పెద్దలు ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, దాము గారు, వివి వినాయక్, జయసుధ గారు తమ సహాకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వచ్చి అవసరంలో ఉన్న పేదలకు దిల్ రాజు, దాము, ప్రసన్న కుమార్ చేతుల మీదుగా 25 వేలు చొప్పన చెక్కుల పంపిణి అందజేయడం సంతోషంగా ఉంది అని అన్నారు.

దేవుడు ఉన్నాడా.. లేడా. రెగ్యూలర్ చర్చలు వింటాం. మనకు తెలియకపోయినా నమ్మేవాళ్లు నమ్ముతారు.. నమ్మని వాళ్లు నమ్మరు. మనిషి ద్వారా ఎదుటి మనిషికి సాయం పొందినప్పుడే దేవుడున్నాడని కొందరు చెబుతుంటారు అలాంటి సందర్భంలోనే నమ్ముతారు. మనం సైతం సేవ కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి, మనిషికి కాదంబరి కిరణ్ ఓ వారధి.. ఇలాంటివి చూసినప్పుడు దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది. సినీ పెద్దలు, స్నేహితుల సపోర్ట్ తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీ చివరి శ్వాస వరకు ఈ సేవలు కొనసాగించాలి.. మీకు మేమంతా తోడుంటం అని కాదంబరి కిరణ్ ని అభినందించారు దిల్ రాజు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>