PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china6f151ca6-c290-4d66-b023-640f88c562f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china6f151ca6-c290-4d66-b023-640f88c562f4-415x250-IndiaHerald.jpgప్రపంచ స్థాయి యుద్ధ సంక్షోభాల నడుమ గురువారం అమెరికా, చైనా అధినేతలు జో బైడెన్, షీ జిన్ పింగ్ల మధ్య సమావేశం జరిగింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా ఫసిఫిక్ ఎకనామిక్ కారిడార్ కో ఆపరేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య జరిగిన రహస్య చర్చలు ఉభయ శక్తుల నడుమ సమన్వయం దిశకు దారితీశాయి. ఇరుదేశాల మధ్య పరస్పర సైనిక సమన్వయ సమాచారం(మిలటరీ టు మిలటరీ కమ్యూనికేషన్) ఏర్పాటుకు ఇరు నేతలు అంగీకరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్యchina{#}Russia;Hong Kong;American Samoa;thursday;oil;contract;INTERNATIONAL;warచైనా, అమెరికా మధ్య పెరుగుతున్న దోస్తీ?చైనా, అమెరికా మధ్య పెరుగుతున్న దోస్తీ?china{#}Russia;Hong Kong;American Samoa;thursday;oil;contract;INTERNATIONAL;warTue, 21 Nov 2023 10:06:00 GMTప్రపంచ స్థాయి యుద్ధ సంక్షోభాల నడుమ గురువారం అమెరికా, చైనా అధినేతలు జో బైడెన్, షీ జిన్ పింగ్ల మధ్య  సమావేశం జరిగింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా ఫసిఫిక్ ఎకనామిక్ కారిడార్ కో ఆపరేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య జరిగిన రహస్య చర్చలు ఉభయ శక్తుల నడుమ సమన్వయం  దిశకు దారితీశాయి.


ఇరుదేశాల మధ్య పరస్పర సైనిక సమన్వయ సమాచారం(మిలటరీ టు మిలటరీ కమ్యూనికేషన్) ఏర్పాటుకు ఇరు నేతలు అంగీకరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇలాంటి అవగాహన కుదరడం కీకల పరిణామం అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా చైనా దేశాల మధ్య ఇప్పటికే మిలటరీ మారీ టైం కన్స్ ల్వేటివ్ అగ్రిమెంట్ అమల్లో ఉన్నా.. పెద్దగా కార్యచరణలో లేదు. ఇప్పడు ఈ ఒప్పందం పరిధిలోకి తరచూ సైనిక వర్గాల స్థాయిలో సంప్రదింపులు దిగాలని ఇప్పటి భేటీలో నిర్ణయించారు.


అయితే ప్రధానంగా తైవాన్ అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తైవాన్ ను ఆక్రమించే దిశగా సాగుతున్నట్లు వచ్చిన నివేదికలను జిన్ పింగ్ ముందు బైడెన్ ప్రస్తావించారు. తైవాన్ లో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని బైడెన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తైవాన్ తో యుద్ధం అనవసరం అని చైనా భావిస్తోంది.


మాల్దీవుల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి తమకు మద్దతుగా ఉన్న ప్రభుత్వాన్ని చైనా ఏర్పాటు చేసుకోగలిగింది.  తైవాన్ లో కూడా అధికారం మారబోతుంది. అక్కడ అధికార పక్షాన్ని గద్దె దింపి ప్రతిపక్షం అధికారంలోకి రాబోతుంది. ఈ ప్రతిపక్షం చైనాకు మద్దతు ఇస్తోంది. గతంలో హాంకాంగ్ ని ఎలా అయితే ఆక్రమించిందో ఇప్పుడు తైవాన్ ను కూడా అదే విధంగా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అమెరికా కు చైనా నుంచి అవసరం పెరిగింది.  రష్యా దగ్గర నుంచి చైనా ఆయిల్ కొనుగోలు చేస్తోంది.  ఈ చమురును చైనా నుంచి అమెరికా కొనుగోలు చేసి తద్వారా ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  పైకి మాత్రం చైనాతో విభేదం. లోలోపల మాత్రం పరస్పర అంగీకారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>