Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warner7da79725-1e46-470d-a07b-e33157058e8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warner7da79725-1e46-470d-a07b-e33157058e8f-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఈ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ టోర్నికీ ఎండ్ కార్డు పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ఫైనల్ లో విజయం సాధించి టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ను ఎగరేసుకు పోతుంది అని అందరూ ఊహించారు. కానీ ఇక ప్రపంచ కప్ లో తమకు ఉన్న అనుభవాన్ని మొత్తం రంగరించి ఫైనల్ లో చూపించిన ఆస్ట్రేలియా ఇక మరోసారి టీమిండియాని సొంత గడ్డమీద ఓడించి ఛాంపియన్గా అవతరించింది అనిWarner{#}Yevaru;News;Ahmedabad;Cricket;Australia;World Cup;Narendra Modiనేను ఫినిష్ అయ్యానని.. మీకెవరు చెప్పారు : వార్నర్నేను ఫినిష్ అయ్యానని.. మీకెవరు చెప్పారు : వార్నర్Warner{#}Yevaru;News;Ahmedabad;Cricket;Australia;World Cup;Narendra ModiTue, 21 Nov 2023 09:45:00 GMTఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఈ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ టోర్నికీ ఎండ్ కార్డు పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ఫైనల్ లో విజయం సాధించి టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ను ఎగరేసుకు పోతుంది అని అందరూ ఊహించారు. కానీ ఇక ప్రపంచ కప్ లో తమకు ఉన్న అనుభవాన్ని మొత్తం రంగరించి ఫైనల్ లో చూపించిన ఆస్ట్రేలియా ఇక మరోసారి టీమిండియాని సొంత గడ్డమీద ఓడించి ఛాంపియన్గా అవతరించింది అని చెప్పాలి.



 ఏకంగా ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్ని ముద్దాడింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇక ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఈ వరల్డ్ కప్ లో ఆడిన ఎంతో మంది సీనియర్ ప్లేయర్లకు ఇదే చివరి వరల్డ్ కప్ అంటూ ఇక వార్తలు తెర మీదకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు వరల్డ్ కప్ ముగిసిన వెంటనే కొంతమంది సీనియర్లు తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది అని క్రికెట్ విశేషకులు అంచనా వేశారు. అయితే ఇలాగే డేవిడ్ వార్నర్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు వచ్చాయి.


 ఇక ఈసారి ఫైనల్లో టైటిల్ గెలవడంతో డేవిడ్ వార్నర్ వరల్డ్ కప్ కెరియర్ అద్భుతమైన రికార్డులతో ముగిసిందని వార్తలు రాగా.  దీనిపై వార్నర్ స్పందించాడు. నేను ఫినిష్ అయ్యానని ఎవరు చెప్పారు అంటూ వార్నర్ ప్రశ్నించాడు. దీంతో 37 ఏళ్ల వార్నర్ మరో వరల్డ్ కప్ ఆడాలని నిర్ణయించుకున్నాడా ఏంటి అని చర్చ మొదలైంది. కాగా వన్డే వరల్డ్ కప్ లో ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ ఇప్పటివరకు 1527 పరుగులు చేశాడు. ఇందులో6 సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ వరల్డ్ కప్ లో కూడా అతను మంచి ప్రస్తానాన్ని కొనసాగించాడు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>